Brothel Case: మేఘాలయ రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరాక్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు. ఆయన ఫాంహౌస్‌లో నడుస్తోన్న సెక్స్ రాకెట్‌ను ఇటీవలే పోలీసులు బయటపెట్టారు. దీంతో ఈ కేసులో సంబంధమున్న బెర్నార్డ్ మరాక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూపీలో అరెస్ట్
తన ఫాంహౌస్‌లో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్లు బెర్నార్డ్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన కోసం పోలీసులు గాలించారు. చివరకు యూపీలో ఆయన్ను అరెస్ట్ చేశారు. బెర్నార్డ్‌ను తీసుకువచ్చేందుకు తమ బృందం వెళ్తున్నట్లు వెస్ట్ గారో హిల్స్ ఎస్పీ వివేకానంద సింగ్ తెలిపారు.
బెర్నార్డ్ కోసం మేఘాలయా పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. తుర కోర్టు బెర్నార్డ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే తాను అమాయకుడినని, సీఎం కాన్రాడ్ సంగ్మా రాజకీయ కుట్రతో తనను ఇరికించినట్లు బెర్నార్డ్ ఆరోపించారు.
ఇదీ జరిగింది
వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణంలో ఉన్న భాజపా నేత బెర్నార్డ్ మరాక్.. తన ఫాంహౌసులో గుట్టుగా సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం ఆకస్మిక రైడ్ చేశారు. ఈ తనిఖీల్లో ఆరుగురు చిన్నారులను రక్షించినట్టు వెస్ట్ గారో హిల్స్ జిల్లా ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు.
ఈ వ్యభిచార దందాతో సంబంధం ఉన్న 73 మంది అరెస్ట్ చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. వారిలో 23 మంది మహిళలు ఉన్నారు. రక్షించిన చిన్నారులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు.
ఫాంహౌసులో 30 చిన్న గదులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసుల రైడ్స్‌లో భాగంగా 400 మందు బాటిళ్లు, 500కు పైగా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, 47 మొబైల్ ఫోన్లు, 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మరాక్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బెర్నార్డ్ కోసం గాలించారు. పరారీలో ఉన్న బెర్నార్డ్ చివరకి యూపీలో దొరికారు.
Also Read: Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 18 వేల మందికి వైరస్
Also Read: Delhi Police: దొంగల్ని ఇలా గుర్తించండి, దిల్లీ పోలీసులు చెప్పిన పాఠం విన్నారా?