Shinde Wishes Uddhav Thackeray: ఠాక్రేకు CM శిందే స్వీట్ విషెస్- మీకు అర్థమవుతోందా?

ABP Desam   |  Murali Krishna   |  27 Jul 2022 12:45 PM (IST)

Shinde Wishes Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే.

ఉద్ధవ్ ఠాక్రేకు శిందే శుభాకాంక్షలు

Shinde Wishes Uddhav Thackeray: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు సీఎం ఏక్‌నాథ్ శిందే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఠాక్రే ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ జగదాంబను ప్రార్థిస్తున్నట్లు శిందే ట్వీట్ చేశారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవా ఠాక్రేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆరోగ్యంగా ఉండాలని జగదాంబ పాదలను పట్టుకుని ప్రార్థిస్తున్నాను.                                                                - ఏక్‌నాథ్ శిందే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

మోసం

మరోవైపు ఉద్ధవ్‌ ఠాక్రే మరోసారి ఏక్‌నాథ్ శిందేపై ఆరోపణలు చేశారు. తాను దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తే, ఆ నమ్మకాన్ని శిందే చంపేశారని ఉద్ధవ్ అన్నారు.

ఈ బాధ నా జీవితాంతం ఉంటుంది. నేను ఓ వ్యక్తిని నమ్మి ఆయనకు పార్టీలో నంబర్ 2 స్థానాన్ని ఇచ్చాను. నిన్ను (శిందే) నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించాను. కానీ నేను ఆసుపత్రిలో ఉన్న సమయంలో నువ్వు ఆ నమ్మకాన్ని చంపేశావు.                                                                - ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం

మరో ఠాక్రే

మరోవైపు జైదేవ్ ఠాక్రే మాజీ భార్య స్మితా ఠాక్రే.. సీఎం ఏక్‌నాథ్ శిందేతో భేటీ అయ్యారు. ఉద్ధవ్ ఠాక్రేకు జైదేవ్ ఠాక్రే స్వయానా అన్నయ్య. 2004లో స్మితా ఠాక్రేకు జైదేవ్ విడాకులు ఇచ్చారు. 

Also Read: SC on Political Parties Freebies: 'ఉచిత హామీలు ఇవ్వడం సీరియస్ అంశం- కేంద్రం ఎందుకు మాట్లాడట్లేదు?'

Also Read: Brothel Case: సెక్స్ రాకెట్ కేసులో ఆ రాష్ట్ర BJP ఉపాధ్యక్షుడు అరెస్ట్

Published at: 27 Jul 2022 12:45 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.