కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. కేరళలో వర్షాలు, వరదల ధాటికి 21 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. కేరళను అన్ని విధాలా ఆదుకుంటామని మోదీ హామీ ఇచ్చారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు.
కేరళ సీఎం శ్రీ పినరయి విజయన్‌తో రాష్ట్రంలో సంభవించిన వరదల గురించి చర్చించాను. క్షతగాత్రులను, బాధితులను కాపాడేందుకు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. అందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
వర్షాలు, వరదల వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
21 మంది మృతి..
భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో కేరళలో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కొట్టాయంలో 13 మంది, ఇడుక్కి జిల్లాలో 8 మంది మృతి చెందారు. ఈ మేరకు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.
సీఎం సమావేశం..
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని విజయన్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.
భారీ వర్షాలకు నదులు, డ్యామ్‌లలో నీరు పెరుగుతుందని తదుపరి 24 గంటలు హై అలర్ట్‌లో ఉండాలన్నారు. ఇప్పటికే సైన్యం, వాయుసేన, నౌకాదళం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని సీఎం విజయన్ వెల్లడించారు.
అమిత్ షా హామీ..
కేరళలో కురుస్తోన్న భారీ వర్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. వర్షాలు, వరదల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అమిత్ షా అన్నారు. ప్రజలను కాపాడేందుకు కేంద్రం అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వానికి సాయమందిస్తుందన్నారు.
Also Read: Kerala Rain Fury: కేరళలో మహా విలయం.. వర్షాలు, వరదల ధాటికి 21 మంది మృతి
Also Read: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్
Also Read: భర్త నిద్రిస్తుండగా అక్కడ వేడి వేడి నీళ్లు పోసిన భార్య