కేరళలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో 21 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ఈ మేరకు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది.


ఉన్నతస్థాయి సమావేశం..


రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని విజయన్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. 


భారీ వర్షాలకు నదులు, డ్యామ్‌లలో నీరు పెరుగుతుందని తదుపరి 24 గంటలు హై అలర్ట్‌లో ఉండాలన్నారు. ఇప్పటికే సైన్యం, వాయుసేన, నౌకాదళం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని సీఎం విజయన్ వెల్లడించారు.






కొండప్రాంతాల్లో నివసించేవారు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నావారిని వీలైనంత త్వరగా పునరావాస కేంద్రాలను తరలిస్తున్నారు అధికారులు. కొక్కాయర్, ఇడుక్కి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని తరలించేందుకు మీడియమ్ లిఫ్ట్ హెలికాప్టర్లను వాయుసేన వినియోగిస్తోంది.


15 మంది గల్లంతు..


వర్షాలు కాస్త తగ్గినప్పటికీ కొట్టాయంలో 15 మంది గల్లంతయ్యారు. కొట్టాయం, పతనంతిట్ట, ఇడుక్కి జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. అక్టోబర్ 20 వరకు తిరువనంతపురంలో వర్షాలు పడనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది.


తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పాలక్కాడ్, మలప్పురం, కొజికోడ్, వయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఇచ్చారు. కొన్ని రోజులపాటు కేరళలో భారీ గాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.


ఆదుకుంటాం..






కేరళలో కురుస్తోన్న భారీ వర్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. వర్షాలు, వరదల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అమిత్ షా అన్నారు. ప్రజలను కాపాడేందుకు కేంద్రం అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వానికి సాయమందిస్తుందన్నారు.


Also Read: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్


Also Read: భర్త నిద్రిస్తుండగా అక్కడ వేడి వేడి నీళ్లు పోసిన భార్య


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి