యాపిల్ ఐడీ బ్యాలెన్స్ ద్వారా చెల్లింపులు చేపట్టాలని భారత డెవలపర్లను టెక్ దిగ్గజం యాపిల్ ప్రోత్సహిస్తోంది. యాపిల్ ఐడీకి నిధులు జత చేసిన భారత యూజర్లకు 20 శాతం బోనస్ ఇస్తామని ప్రకటించింది.
ఇండియన్ యాపిల్ ఐడీ అకౌంట్‌కు నిధులు జత చేస్తే 20 శాతం బోనస్ ఇస్తామని యాపిల్ నోటిఫై చేసినట్టు 9To5Mac రిపోర్టు చేసింది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. రూ.100 నుంచి రూ.15వేల వరకు యాపిల్ ఐడీ బ్యాలెన్స్‌కు ఫండ్స్ జత చేస్తే బోనస్ ఇవ్వనుంది.
ఉదాహరణకు ఎవరైనా యూజర్ తమ యాపిల్ ఐడీకి రూ.2000 జత చేస్తే వారికి రూ.400 బోనస్ ఇస్తారు. రూ.10వేలు జత చేస్తే రూ.2000 వరకు అదనంగా బోనస్ వస్తుంది. ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయని వెల్లడించింది.
భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల ఆటో రెన్యూవల్ సబ్‌స్క్రిప్షన్స్ యాప్స్‌పై ప్రభావం పడనుందని యాపిల్ తెలిపింది. అందుకే యాపిల్ ఐడీ బ్యాలన్స్‌ను ఉపయోగించాలని డెవలపర్లను కంపెనీ ఆదేశించింది. దీనిపై కొత్త నిబంధనల ప్రభావం ఉండదని పేర్కొంది. 20 శాతం బోనస్ ఇవ్వడం వల్ల భారత యూజర్లు సంతోషిస్తారని 9To5Mac వెల్లడించింది. దీని వల్ల యాపిల్ ఇన్ యాప్ పర్చేజెస్ వ్యవస్థకు ఇబ్బందులు తప్పుతాయని అంటోంది.
Also Read: PF Balance Check: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియడం లేదా? ఇలా చేస్తే వెంటనే తెలుసుకోవచ్చు
Also Read: Bank Charges: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి