స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు భవిష్యత్తును అంచనా వేయడం ముఖ్యం. రాబోయే రోజుల్లో ఆ షేరు ధర ఎలా ఉండబోతోందో, కంపెనీ ప్రదర్శన ఎలా ఉంటుందో ఊహించడం అవసరం. అప్పుడే మల్టీబ్యాగర్ షేర్లు కంటబడతాయి. రాబడీ ఊహించనంత అధికంగా అందుకోవచ్చు. గీతా రెన్యూవబుల్ ఎనర్జీ షేరూ అలాంటిదే. ఏడాది క్రితం ఇందులో లక్ష రూపాయాలు పెట్టుంటే నేటికి రూ.42 లక్షలు వచ్చుండేవి!
గీతా ఎనర్జీ షేరు ఏడాది కాలంలోనే రూ.5.52 నుంచి రూ.233కు పెరిగింది. ఏకంగా 4,130 శాతం రాబడి ఇచ్చింది. గతవారం చివరి ఐదు సెషన్లలో ప్రతిసారీ ఐదు శాతం అప్పర్ లిమిట్‌ను తాకింది. 2021లో ఈ షేరు ధర రూ.88 నుంచి రూ.233కు పెరిగింది. చివరి ఒక్క నెల్లోనే 165 శాతం పెరిగింది. చివరి ఆరు నెలల్లో రూ.29 నుంచి ఇప్పటి ధరకు చేరుకుంది. 695 శాతం రాబడి ఇచ్చింది. ఇక 2021లో ఏకంగా 3230 శాతం వరకు పెరిగింది. అంటే ఏడాదిలో ఏకంగా 42 రెట్లు హెచ్చింది.
గీతా రెన్యూవబుల్ ఎనర్జీ షేరులో ఒక వారం క్రితం లక్ష పెట్టుంటే ఇప్పుడది రూ.1.21 లక్షలు అయ్యేది. ఒక నెల క్రితం లక్ష పెడితే ఇప్పుడు రూ.2.65 లక్షలు వచ్చేవి. అదే ఆరు నెలల క్రితం పెట్టుంటే రూ.7.95 లక్షలు అందేవి. ఏడాది క్రితం రూ.5.52 ధర వద్ద లక్ష పెట్టుంటే ఇప్పుడే ఏకంగా రూ.42.30 లక్షలు చేతికి వచ్చేవి.
నోట్: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్నవి. షేర్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణులు సలహాలు తీసుకోవడం అవసరం! డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను అధ్యయనం చేయడం ముఖ్యం. ఏబీపీ అందిస్తోన్న మార్కెట్ల సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఫలానా స్టాక్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ చెప్పడం లేదు.
Also Read: PF Balance Check: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియడం లేదా? ఇలా చేస్తే వెంటనే తెలుసుకోవచ్చు
Also Read: Bank Charges: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి