దేశంలో ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలు దారిలో నడుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు పెట్టాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతపు కర్ఫ్యూ పెడుతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం రాత్రి గం.10 ల నుంచి సోమవారం ఉదయం గం. 5 ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక మంత్రి ఆర్ అశోక మీడియాతో ఈ ఆంక్షల వివరాలు వెల్లడించారు. 


Also Read: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. థర్డ్ వేవ్ వైపు పయనిస్తున్నామా?






మళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల వ్యాప్తి దృష్ట్యా కర్ణాటక వారాంతపు కర్ఫ్యూను విధించనుంది. రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు మంత్రి ఆర్.అశోక తెలిపారు. నిత్యావసర వస్తువులు, హోటళ్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. మంగళవారం విలేకరుల సమావేశంలో రెవెన్యూ మంత్రి ఆర్ అశోక మాట్లాడుతూ... “ రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు ఐదు రెట్లు పెరిగాయి. ఇవాళ 147 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే రెండు రెట్లు వేగంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చాం. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో 85 శాతం బెంగళూరులోనే ఉన్నాయి. రెండు వారాల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాం. మాల్స్, పబ్బులు, థియేటర్లు, బార్లు, జిమ్‌లు 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారిని మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో అనుమతి ఇస్తాం' అని మంత్రి అశోక అన్నారు. 


Also Read: ఈ దేశానికి ఏమైంది? ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు కరోనా.. కొత్తగా 37 వేల కేసులు


Also Read: Arvind Kejriwal Coivd Positive: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన


Also Read: Vizianagaram: విజయనగరం జిల్లాలో కరోనా కలకలం... కొత్తవలస పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఒక టీచర్ కు పాజిటివ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి