అక్రమ సంబంధం కారణంగా.. ఓ కుటుంబంలో చిచ్చురేగింది. ఒకరి ప్రాణాలు పోయేలా చేసింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండ‌లం సుంకేట్ గ్రామానికి చెందిన మాజీ స‌ర్పంచ్ కృష్ణా రెడ్డి కొన్నేళ్ల క్రితం ఆనారోగ్యం కారణంగా చనిపోయారు. విధి పగబట్టినట్టుగా.. కొన్ని రోజులకే.. అతడి కుమారుడు.. మ‌ధురెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇంట్లో కృష్ణారెడ్డి భార్య రాజ‌గంగు (55), ఆమె కోడ‌లు సుజాత‌, మ‌నుమ‌డు ఉంటున్నారు. అయితే కొంతకాలంగా.. కోడలు.. సుజాత.. ఓ వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఇలా చేస్తే.. కుటుంబ పరువు పోతుందని.. అత్త రాజగంగు కోడలను హెచ్చరించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. 


అక్రమ సంబంధానికి అడ్డువస్తుందనే కారణంతో అత్తను ఎలాగైనా.. చంపాలనుకుంది. కొన్ని రోజులుగా సమయం కోసం వేచి చూసింది. శనివారం రాత్రి.. అత్తకు ఉరి వేసి చంపింది. అయితే అనుమానం రాకుండా.. అత్తనే ఆత్మహత్య చేసుకుందని నమ్మించింది. ఈ విషయం నమ్మిన గ్రామస్థులు.. మరిసటి రోజు.. అంత్యక్రియలు  నిర్వహించారు.


ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేని రాజగంగు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని.. బంధువులకు అనుమానం వచ్చింది. కోడలిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పింది. సోమవారం వెళ్లి పోలీసులను ఆశ్రయించారు.  రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజం బయటకు రాబట్టారు. ఆమెతో పాటు ఇంకా ఎవరైనా ఈ క్రైమ్ లో ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతిరాలి ఆస్థికలతో పాటు ఇతర ఆధారాలను సేకరించారు పోలీసులు. ఇప్పుడు సుజాత కొడుకు భవిష్యత్ ఇబ్బందిలో పడే పరిస్థితి వచ్చింది.


Also Read: Bulli Bai App Case: అసలేంటి ఈ 'బుల్లి బాయ్' లొల్లి.. అంతా చేసింది మహిళేనా?


Also Read: Jawan Kills Teacher : కుమార్తెను కొట్టిందని టీచర్‌పై జవాన్ కాల్పులు .. కానీ గాయపడింది ఆయన భార్య ! ఎలా అంటే ...


Also Read: Jawan Kills Teacher : కుమార్తెను కొట్టిందని టీచర్‌పై జవాన్ కాల్పులు .. కానీ గాయపడింది ఆయన భార్య ! ఎలా అంటే ...


Also Read: Karimnagar Court: మీ-సేవ నుంచి ఈడ్చుకొచ్చి పట్టపగలే యువతి హత్య.. మూడేళ్లకు కోర్టు సంచలన తీర్పు, సర్వత్రా హర్షం


Also Read: Nellore Crime: ప్రేమతో కూర వండిన భార్య.. మొహం చిట్లించిన భర్త, ఆవేశంతో ఘోరానికి పాల్పడ్డ భార్య