దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బుల్లీ బాయ్​' కేసులో అరెస్ట్‌లు మొదలయ్యాయి. ప్రధాన నిందితురాలిని ఉత్తరాఖండ్​లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఓ 21ఏళ్ల ఇంజినీరింగ్​ విద్యార్థిని కూడా ఈ కేసులో అరెస్ట్​ చేశారు. అతడిని విశాల్​ కుమార్​గా గుర్తించారు. మరికొందరిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.










ఏంటి ఈ యాప్..


బుల్లీ బాయ్​​ పేరిట టెక్నాలజీని ఉపయోగించి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక వర్గానికి చెందిన మహిళలను కించపరిచేలా వికృత చేష్టలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఏకంగా మనుషుల్నే యాప్‌లలో అమ్మకానికి పెట్టేస్తున్నారు. బుల్లీ బాయ్‌ నిర్వాహకులపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఎంపీ ఫిర్యాదు..


శిససేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ యాప్ నిర్వాహకులు వేలం పేరిట ఓ వర్గానికి చెందిన మహిళల ఫొటోలు యాప్‌లో పెట్టి అల్లరిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దీనిపై స్పందించారు. బుల్లీ బాయ్‌ యాప్‌, సైట్‌ను తొలగించినట్లు వెల్లడించారు. పోలీసుల సహా ఇతర సంబంధిత యంత్రాంగం దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Also Read: Guruvayur Temple: భక్తులారా ఇదేమైనా న్యాయమా..? పనికిరావని హుండీలో వేస్తారా?




Also Read: India's Omicron Cases: ఈ దేశానికి ఏమైంది? ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు కరోనా.. కొత్తగా 37 వేల కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి