రోగ్యానికి పెరుగు ఎంత మంచిదో తెలిసిందే. ముఖ్యంగా వేసవి కాలంలో పెరుగు కడుపును చల్లగా ఉంచడమే కాకుండా శరీరాన్ని డీహైడ్రేడ్ కాకుండా కాపాడుతుంది. అందుకే.. వేసవిలో మజ్జిగ అస్సలు మిస్ కాకూడదు. పెరుగులో ఉండే లైవ్ బ్యాక్టీరియా, ఈస్ట్‌లనే ‘ప్రోబయోటిక్స్’ అంటారు. ఇవి పేగులను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి జీర్ణవ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు దాడి చేయకుండా కాపాడతాయి. మన శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచుకోవాలంటే పెరుగు తప్పకుండా తినాలి. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కూడా పెరుగు మంచిదే. 


చలికాలంలో తినొచ్చా?: శరీరానికి చల్లదనాన్ని అందించే పెరుగును.. చలికాలం తినకూడదని, అది దగ్గు, జలుబును తీవ్రం చేస్తుందని అంటారు. అయితే, అది అపోహ మాత్రమేనని ఆహార నిపుణులు అంటున్నారు. చలికాలంలో వ్యాధులు, వైరస్‌లు యాక్టీవ్‌గా ఉంటాయి. వాటితో పోరాడాలంటే.. రోగనిరోధక శక్తి చురుగ్గా ఉండాలి. పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు, శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి కూడా పెరుగు కాపాడుతుంది.  


Also Read: దేశీయులు మహా రసికులు.. ఒక్కొక్కరూ 14 మందితో సెక్స్.. మనోళ్లు వెనుకబడ్డారే!


చలికాలంలో పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే: 
⦿ పెరుగులో విటమిన్స్‌తోపాటు పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్ ఉంటాయి. 
⦿ పెరుగులోని   లాక్టోబాసిల్లస్ (lactobacillus) చెడు బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. 
⦿ పెరుగులో ఉండే విటమిన్-సి.. జలుబు, దగ్గును నియంత్రిస్తుంది. 
⦿ పెరుగును ఫ్రిజ్‌లో పెట్టి తినకూడదు. కొనుగోలు చేసిన వెంటనే.. లేదా తోడుకున్న వెంటనే వాడేయాలి.
⦿ ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని పెరుగును తినడం వల్ల మేలు చేసే బ్యాక్టీరియా చనిపోయి.. పరిస్థితిని జఠిలం చేస్తుంది. 
⦿ పెరుగు జీర్ణ క్రియను మెరుగ్గా ఉంచుతుంది. అందుకే మన పూర్వికులు భోజనం తర్వాత తప్పకుండా పెరుగు తినాలని అంటారు. 
⦿ కడుపులో ఎసిడిటీ ఏర్పడకుండా pH (Potential of Hydrogen) బ్యాలెన్స్ చేస్తూ.. జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేస్తుంది. 
⦿ పెరుగులో తక్కువ కొవ్వు, క్యాలరీలు ఉంటాయి. కాబట్టి.. బరువు పెరుగుతామనే చింత కూడా అక్కర్లేదు. 
⦿ పెరుగు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. చలికాలంలో పెరుగును తీసుకున్నా.. చర్మానికి రాసుకున్నా మంచిదే.  


హెచ్చరిక: ఇది ‘abp దేశం’ ఒరిజనల్ కంటెంట్. కాపీ చేసినచో copyright act కింద చర్యలు తీసుకోబడతాయి.


గమనిక: ఈ కథనంలోని అంశాలను కేవలం మీ అవగాహన కోసమే అందించామని గమనించగలరు. ఈ ఆహారం వల్ల అలర్జీలు లేదా మీకు మరే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా.. తప్పకుండా వైద్యుడి సలహా, సూచనలు తీసుకోవాలి. 


Also Read: యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...


Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్


Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!


Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)


Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి