బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట- బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి  జైల్లో ఉన్న ఎమ్మెల్సీ క‌వితకు భారీ ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కవిత మార్చి 15వ తేదీ నుంచి తీహార్‌ జైల్లో ఉన్నారు. ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న వారికి వరుసగా బెయిళ్లు వస్తున్నాయి. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఈ మధ్యే బెయిల్ వచ్చింది. క‌విత త‌ర‌ఫున  ప్రమఖ లాయర్ ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆప్తులే ఇసుకను ఇసుక దోచుకుతింటున్నారు- వదిలిపెట్టనంటూ జెసి ప్రభాకర్ రెడ్డి వార్నింగ్
ఏపీలో ఇసుక విష‌యంలో ప్రతిపక్షాల ఆరోపణలు ఊతమిచ్చేలా అధికార పార్టీకి చెందిన నేత మాట్లాడటం కలకలం రేపుతోంది. టీడీపీ నేతలే ఇసుక దోచుకుంటున్నారన్న ఆరోపణలను సమర్థిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అనంతపురంజిల్లాలో టీడీపీ నేతల మధ్య ఉన్న వర్గవిభేదాలు ఇలా ఇసుక రూపంలో బ‌య‌ట‌కొచ్చాయి.  త‌మ పార్టీకి చెందిన నాయ‌కులు, త‌న అనుచ‌రులే విచ్చ‌ల‌విడిగా ఇసుక దోచుకుంటున్నార‌ని తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వీడియో రిలీజ్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఎగ్‌ పఫ్‌లు బాగా తిన్నట్టున్నారు- వైసీపీ మద్దతుదారునికి ఇచ్చిపడేసిన సాయిధరమ్‌తేజ్
అన్న క్యాంటీన్‌లో శుభ్రత లేదంటూ వైసీపీ సోషల్ మీడియా రచ్చరచ్చ చేస్తోంది. దీనిపై ప్రభుత్వం, టీడీపీ నేతలు వివరణ ఇస్తున్నా వారి మాత్రం వివాదాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దీంట్లోకి హీరో సాయిధరమ్‌ తేజ్‌ను కూడా లాగేశారు వైసీపీ మద్దతుదారులు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ సేఫ్‌ హ్యాండ్స్‌లోకి వెళ్లిందని ఎన్నికల ఫలితాలు తర్వాత సాయిధరమ్‌ తేజ్ పెట్టిన పోస్టును గుర్తు చేస్తే వైసీపీ మద్దతుదారులు ప్రదీప్‌రెడ్డి అనే ఎన్‌ఆర్‌ఐ పోస్టు పెట్టాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


పోలవరం తొలిదశ డీపీఆర్‌కు ఆమోదముద్ర పడేనా- రేపటి కేంద్ర కేబినెట్‌ ఏ నిర్ణయం తీసుకోనుంది?
పోలవరం ప్రాజెక్ట్‌... ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ప్రజల కలల ప్రాజెక్ట్‌. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే... రాష్ట్రంలోని రైతుల సాగునీటి కష్టాలు తీరుతాయి. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని... నిల్వచేసి... రైతులు  అందిచవచ్చు. అయితే... ఈ ప్రాజెక్టు.. కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఈ ప్రాజెక్టును... రాష్ట్రంలో ఏర్పాటయిన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తోంది. కొత్త ప్రాజెక్ట్‌ డిజైన్‌ను సిద్ధం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వరంగల్‌లో రాజముద్ర వివాదం అధికారుల అత్యుత్సాహమా? తప్పిదమా?
తెలంగాణ రాష్ట్ర రాజముద్ర వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ దీనంతటికీ కారణమైంది. అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణపై సందేహాలు నివృత్తి కోసం ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై తెలంగాణ రాజముద్ర కాకుండా ఈ మధ్య కాలంలో వైరల్ అయిన ముద్రను ప్రింట్ చేశారు.  ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కొద్ది సేపటికే వివాదం, విమర్శలు వెలువడటంతో ఫ్లెక్సీ తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కొత్త రాజముద్రాలను అధికారికంగా ప్రకటించక ముందే అధికారులు కొత్త రాజముద్రతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి