Jammu Kashmir Bus Accident: జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మినీ బస్సు లోయలో పడిపోయిన ఘటనలో 11 మంది మరణించారు. 25 మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను మండిలోని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
పరిహారం
ఘటనపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రపతి సంతాపం
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ముర్ము తెలిపారు.
Also Read: SCO Summit 2022: రెండేళ్ల తరవాత ప్రధాని మోదీ, పుతిన్ భేటీ, ఆ ఒప్పందం కుదురుతుందా?
Also Read: Bharat Jodo Yatra: జోడో యాత్రలో జోష్ నింపిన రాహుల్ గాంధీ- తగ్గేదేలే!