ప్రపంచానికి అంతం ఉండదు.. పుట్టేవాళ్లు పుడుతూ ఉంటారు.. పోయేవాళ్లు పోతూ ఉంటారు అనే నిర్వేదం చాలా మందికి వస్తూ ఉంటుంది. అయితే అలాంటిదేమీ లేదని.. ప్రపంచం మొత్తం ఒక్క సారే అవంతమవబోతోందని ప్రపంచప్రఖ్యాత శాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. ఐజాక్ న్యూటన్ గురించి స్కూల్ గడప తొక్కిన ప్రతి ఒక్కరికీ తెలుసు. గురుత్వాకర్షణ సూత్రాన్ని ప్రపంచానికి చెప్పిన ఐజాక్ న్యూటన్..  అప్పట్లోనే ప్రపంచం అంతమయ్యే సంవత్సరాన్ని అంచనా  వేశారు.  2060 నాటికి ప్రపంచం ముగిసిందని న్యూటన్ తన లెక్కల ఆధారంగా చెప్పాడు. కొన్ని సూత్రాల ఆధారంగా న్యూటన్ ఈ విషయం చెప్పాడు. అలా అంచనా వేసిన లేఖ బయట పడింది. 


ఇదేం కంగారు సామీ- కమలా హారిస్‌ను కూడా వదల్లేదుగా!
 
టన్‌ ప్రపంచంలోని గొప్ప గణిత శాస్త్రవేత్త అంతే కాదు భౌతిక శాస్త్రవేత్త కూడా ఆయన ప్రతిపాధించిన థియరీలపై ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి. సర్ ఐజాక్ న్యూటన్ తన చివరి లేఖలలో ప్రపంచ ముగింపు గురించి ప్రస్తావించాడు.  న్యూటన్ ప్రపంచం అంతం కోసం ఒక సూత్రాన్ని కూడా ఇచ్చాడు. 1704 సంవత్సరంలో న్యూటన్ ఈ అంచనా వేశాడు. అంచనాతో పాటు న్యూటన్ ఈ సూచన కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన లేఖ ఒకటి ఆయన ఇంట్లో దొరికింది. అతను 1727 లో మరణించాడు. ఆ తరువాత అతను రాసిన లేఖలు అతని ఇంట్లో లభించాయి.


ఉక్రెయిన్‌పై పుతిన్ తగ్గేదేలే! ఐసీజే ఆదేశాలను కూడా లెక్కచేయని రష్యా


 న్యూటన్ లెక్కల ఆధారంగా 2060 ను ప్రపంచ ముగింపు సంవత్సరంగా లెక్కించాడు. ఈ సమయానికి ప్రపంచం అంతం కాకపోయినా.., దాని విధ్వంసం ప్రారంభమవుతుందని ఆయన లెక్కల సారంశం. న్యూటన్ గురించి  సారా డ్రై పేపర్స్ రాసిన పుస్తకంలో ఈ లేఖను ప్రచురించారు. ఈ పుస్తకంలో న్యూటన్ తన జీవితంలో 10,000 నోట్లు, లేఖలు రాసినట్లుగా తెలిపారు. 1936 లో అతని నోట్స్, లేఖలు వేలం వేశారు. 


పాకిస్థాన్ మంత్రి మానవ బాంబు అయి వాళ్ల పార్లమెంట్‌నే పేల్చేస్తాడట ! అందరూ అంతేనా ?


అయితే న్యూటన్ చెప్పినట్లుగా కాకుండా..కరోనా దెబ్బకు అతలాకుతరం అయిపోయిన ప్రపంచాన్ని చూడటం.. కరోనా వేవ్స్.. వేరియంట్లు విరుచుకుపడటం వంటివి చూస్తే  న్యూటన్ చెప్పింది నిజమేనేమో.. అని నమ్మకతప్పదు. ఇప్పటికి ప్రారంభమై... అప్పటికి ప్రపంచం అంతమైపోతుందేమో ? ఒక వేళ నిజంగా అంతమైపోతే.. న్యూటన్ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి కూడా ఎవరూ ఉండరు.