ISKCON Temple Attack: బంగ్లాదేశ్‌లో రాధాకాంత మందిరాన్ని 200 మందికిపైగా దుండగులు ధ్వంసం చేశారు. ఆ దేశ రాజధాని ఢాకాలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత మందిరం ధ్వంసమైనట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.






ఎలా జరిగింది?


ఉద్దేశపూర్వకంగానే దాదాపు 200 మందికి పైగా దుండగులు ఢాకాలోని 222 లాల్ మోహన్ సాహా వీధిలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత మందిరంపై దాడి చేశారు. మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి లూటీ చేసినట్లు తెలుస్తోంది. గురువారం ఈ ఘటన జరిగింది.


ఈ దాడిలో సుమంత్ర చంద్ర శ్రావణ్, నిహార్ హల్దర్, రాజీవీ భద్ర సహా పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడి హజీ షఫియుల్లా నేతృత్వంలో జరిగినట్లు సమాచారం.


గతేడాది


గతేడాది దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్​లోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని ఛాందసవాదులు. ఆ సమయంలో చెలరేగిన అల్లర్లలో నలుగురు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. హింసను అరికట్టేందుకు అప్పుడు 22 జిల్లాల్లో పారామిలటరీ దళాలను మోహరించింది ఆ దేశ ప్రభుత్వం.


అయితే ఆ తర్వాత వాటికి వ్యతిరేకంగా మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే అల్లరి మూకలు హిందువుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 66 ఇళ్లను ధ్వంసం చేశారు. సుమారు 20 ఇళ్లకు నిప్పు పెట్టారు.


భారత్ ఆందోళన


హిందూ దేవాలయాలపై, హిందువల ఇళ్లపై దాడులు చేయండపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని భారత విదేశాంగ శాఖ ఆ దేశాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆ దేశ ప్రధాని షేక్ హసీనా.. దాడులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అయితే తాజాగా మరోసారి హిందువుల మందిరంపై దాడి జరిగింది. మరి ఈసారి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.


Also Read: Corona Cases India: దేశంలో భారీగా పెరుగుతున్న కొవిడ్ మరణాలు, కేసులు తగ్గినా తప్పని ఆందోళన


Also Read: Stealth Omicron:స్టెల్త్ ఒమిక్రాన్ భారతదేశంలో మరొక వేవ్‌కు కారణం కావచ్చు, చెబుతున్న ఏపీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్