Corona Cases India: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ దాదాపు తగ్గిపోయింది. కానీ ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో కొత్త వేరియంట్లు ఆందోళన పెంచుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,528 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 149 మంది కొవిడ్ 19తో పోరాడుతూ చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. ఇలాంటి సమయంలో మళ్లీ కోవిడ్ నాలుగో వేవ్ రాబోతోందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
భారత్‌లో కరోనా బాధితులు: 4,30,04,005
ఇప్పటివరకూ నమోదైన మరణాలు: 5,16,281
ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 29,181
ఇప్పటివరకూ కోలుకున్నవారు: 4,24,58,543
దేశంలో గురువారం నాడు 6,33,867 కరోనా టెస్టులు నిర్వహించారు.
పాజిటివ్ కంటే రికవరీలే అధికం..
గురువారం ఒక్కరోజులో పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు అధికంగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజు 3,997 మంది కరోనా మహమ్మారిని జయించారు. దీంతో దేశంలో కరోనా రికవరీల సంఖ్య 4 కోట్ల 24 లక్షల 58 వేల 543కి చేరింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 29,181కి దిగొచ్చాయి. మొత్తం కేసులలో ఇది 0.07 శాతం అని రోజువారీ రికవరీ రేటు సైతం 0.40 శాతానికి దిగొచ్చినట్లు కేంద్ర వైద్యశాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటివరకూ కరోనాతో 5 లక్షల 16 వేల 281 మంది చనిపోయారు.
వ్యాక్సినేషన్ భేష్..
దేశంలో కరోనా రికవరీ రేటు 98.73 శాతానికి చేరుకుంది. థర్డ్ వేవ్ తగ్గినా, ఆరోగ్యశాఖ మాత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. గత ఏడాది జనవరిలో వ్యాక్సినేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి నేటి ఉదయం వరకు 1,80,97,94,58 (180 కోట్ల 97 లక్షల 94 వేల 580) డోసుల కరోనా టీకాలు పంపిణీ చేశారు.
Also read: ముఖం కాలిపోయింది, గుండె జబ్బు వేధిస్తోంది, అయినా మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచి గెలిచింది