Indian Railway news: రైల్వే ఉద్యోగులకు కేంద్ర తీపికబురు చెప్పింది. చాలా కాలంగా ఎలాంటి ఎదుగూ బొదుగూ లేకుండా ఉద్యోగాల్లో కొనసాగుతోన్న వారికి వేతనాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ. ఈ నిర్ణయంతో దాదాపు 80 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
వేతన గ్రేడ్లు
దాదాపు 80 వేల మంది తమ వేతన గ్రేడ్లను మెరుగుపరుచుకునే కొత్త నిబంధనను రైల్వేశాఖ ప్రకటించింది. ఈ నిబంధన మేరకు పర్యవేక్షక విభాగంలో ఉన్న సిబ్బంది గ్రూప్ 'ఏ' అధికారులతో సమానంగా అధిక వేతన గ్రేడ్లకు చేరుకునే అవకాశముంది. ఈ వివరాలను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు.
వీరికి లబ్ధి
ఈ చర్యలతో స్టేషన్ మాస్టర్లు, టికెట్ పరిశీలకులు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ల వంటి సూపర్‌వైజర్ గ్రేడ్ ఉద్యోగులు 40 వేల మందికి ప్రయోజనం ఉంటుంది. వేతన గ్రేడ్లలో పెంపుదల ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.2,500 నుంచి రూ.4000 వరకు నెల వేతనం పెరుగుతుంది.
Also Read: Steve Jobs Sandals: వేలంలో రూ.1.77 కోట్లకు అమ్ముడుపోయిన ఆయన పాత చెప్పులు!