తెలంగాణ 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్‌ కీని టీఎస్‌పీఎస్సీ నవంబరు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు టీఎస్‌పీఎస్సీ ఫైనల్‌ కీని విడుదల చేసింది. ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కులు ఇవ్వనున్నట్టు చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. సబ్జెక్టు నిపుణుల కమిటీతో చర్చించిన తర్వాత 5 ప్రశ్నలను తొలగించినట్టు పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ నిబంధనల ప్రకారం తొలగించిన ప్రశ్నల మార్కులను మిగిలిన ప్రశ్నల జవాబులకు జతచేస్తారు. ఆ ప్రాతిపదికన 145 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కుల చొప్పున జతచేస్తే 149.93 వస్తున్నాయి. అంటే.. ఎన్ని సమాధానాలు సరైనవి రాస్తే ఒక్కోదానికి 1.034 మార్కుల చొప్పున ఇస్తారు. 


ఫలితాలు ఎప్పుడంటే?


ఆన్సర్ కీ ప్రక్రియ ముగియడంతో ఫలితాల విడుదలపై టీఎస్‌‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. అన్ని కుదిరితే వారం రోజుల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువనున్నాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పన మొత్తం 25,150 మంది అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేయనున్నారు. 


తెలంగాణ రాష్ట్ర తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని అక్టోబరు 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షలో వివిధ సిరీస్‌లలో ప్రశ్నలతో పాటు సమాధానాలను కూడా జంబ్లింగ్ చేసి బహుళ సిరీస్‌ల్లో ప్రశ్నపత్రాలను రూపొందించారు. వాటన్నింటికీ మాస్టర్‌గా ఉన్న ప్రశ్నపత్రాన్ని, దాని ప్రాథమిక ఆన్సర్ కీని అధికారులు విడుదల చేశారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపేందుకు 5 రోజులపాటు అవకాశం కల్పించారు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను (OMR డిజిటల్ కాపీలను) కూడా అధికారిక టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ విడుదల చేసింది. మొత్తం 2,85,916 మంది అభ్యర్థుల డిజిటల్ ఓఎంఆర్ పత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డిజిటల్ పత్రాలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 29 వరకు అభ్యర్థుల OMR పత్రాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. గడువు అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఎంఆర్ డిజిటల్ పత్రాలు పొందే అవకాశం లేదని కమిషన్ స్పష్టం చేసింది. 


రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 16న 'గ్రూప్-1' ప్రిలి‌మి‌న‌రీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,86,051 మంది పరీ‌క్షకు హాజ‌ర‌య్యారు. ఈ పరీ‌క్షలో టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ తొలి‌సారి ఒక్కో అభ్యర్థికి ఒక్కో నంబర్‌ సిరీ‌స్‌తో ప్రశ్నా‌పత్రం ఇచ్చింది. ప్రశ్నలు అవే ఉన్నప్పటికీ జంబ్లింగ్‌ పద్ధతిలో జవా‌బులు అడి‌గారు. ప్రతి‌ఒ‌క్కరికీ ఒక్కో ‘కీ’ ఇవ్వడం సాధ్యం కానం‌దున మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌ ప్రిలిమినరీ ‘కీ’ని అక్టోబరు 29న, ఫైనల్ కీని నవంబరు 15న విడుదల చేసింది. 


::Also Read::


KNRUHS: యూజీ ఆయూష్‌ కోర్సుల్లో ప్రవేశాలు, నేటి నుంచి దరఖాస్తులు
యూజీ ఆయూష్‌ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆయూష్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌ కోర్సులల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నవంబరు 12న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీకు 40 శాతం, దివ్యాంగుకు 45 శాతం మార్కులు) ఇంటర్‌ (బైపీసీ) ఉత్తీర్ణులై , నీట్‌-2022లో అర్హత సాధించిన అభ్యర్ధులు నవంబరు 13న ఉదయం 8 గంటల నుండి నవంబరు 20న రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వారు సూచించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
కోర్సులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..