Indian passport :  మధ్య తరగతి భారతీయులకు ఏదైనా ఓ విదేశం వెళ్లి రావాలనే కల ఉంటుంది. అయితే వీసాలు.. ఇతర తలనొప్పులు ఎందుకని ఊరుకుంటారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూసే. పాస్ పోర్టు ఉంటే చాలు వీసా లేకుండా అరవై దేశాలు వెళ్లిపోవచ్చు. . ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ హెన్లే అండ్ పార్టనర్స్ ఒక రిపోర్టును విడుదల చేసింది. ఇందులో భారత్‌ది శక్తివంతమైన పాస్‌పోర్టులలో  ఒకటిగా తేల్చింది. 


హామీ ఇస్తున్నాం, అండగా ఉంటాం- మరోసారి శ్రీలంకకు భారత్ భరోసా


ప్రముఖ టూరిస్ట్ దేశాలకు వీసా లేకుండానే భారతీయులు వెళ్లొచ్చు !


 ఎలాంటి వీసా లేకుండా టూరిస్టులను ఆహ్వానించే దేశాలు ఉన్నాయి. అందులోను ప్రత్యేకంగా భారతీయులకు కొన్ని దేశాలు వీసా ఫ్రీ విజిట్‌ను అందిస్తున్నాయి. దాదాపు 60 దేశాలు కేవలం ఇండియన్ పాస్‌పోర్టుతో వీసా లేకుండా తమ దేశాల్లోని ఆహ్వానిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రసిద్ద టూరిజం డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి. ఒమన్ ,  థాయిలాండ్ ,   మారిషస్ ,  మాల్దీవులు ,  లావోస్ ,  ఫిజి వంటి దేశాలకు వెళ్లిపోవచ్చు. 


అప్పటి నుంచి ఒక్క కశ్మీరీ పండిట్‌ కూడా వలసపోలేదు, లోక్‌సభలో కేంద్రం వివరణ


జపాన్ పాస్‌పోర్టుతో ప్రపంచం మొత్తం వీసా అవసరం లేదు !


ప్రపంచ శక్తివంత పాస్‌పోర్ట్- 2022 జాబితాలో జపాన్ పాస్‌పోర్ట్‌ కు నంబర్ 1 స్థానం దక్కింది. ఆ దేశ పౌరులు ఎలాంటి అవరోధాలు లేకుండా ఏకంగా 193 దేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. అంటే వీసా లేకుండానే దాదాపు ప్రపంచమంతా చుట్టేయొచ్చన్నమాట. ఇక సింగపూర్, దక్షిణకొరియా ఉమ్మడిగా రెండవ స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 192 దేశాలకు పోవచ్చు.  రష్యా పాస్‌పోర్టుకు 119 దేశాల్లోకి ఎంట్రీ ఉంది.  చిట్టచివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆ దేశ పాస్‌పోర్టుతో వీసా లేకుండా కేవలం 27 దేశాల్లోకి మాత్రమే ఈ పాస్‌పోర్టుతో ప్రవేశం ఉంది.


స్నేహమంటే ఇదేరా ! చనిపోయిన స్నేహితుడికి ఆ ఫ్రెండ్స్ ఇచ్చిన నివాళి ఎంటో తెలిస్తే కన్నీరు ఆపుకోలేరు


ఆసియా దేశావే పవర్ ఫుల్ పాస్‌పోర్టులు


కరోనా పరిస్థితులను ఉదహరిస్తూ.. పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్-2017 జాబితా టాప్-10లో ఆసియా దేశాలు అరుదుగా కనిపించాయి. ఇప్పుడు ఆసియా దేశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.   యూరోపియన్ దేశాల ఆధిపత్యం తగ్గింది.  దక్షిణకొరియా కంటే జర్మనీ వెనుకబడింది.   వీసా లేకుండా ఎన్ని దేశాల్లోకి ప్రవేశం లభిస్తోందనేదాన్నిట్టి సంపన్న వర్గాలు, ప్రభుత్వాలు పౌరసత్వం విలువని అంచనా వేసుకుంటాయి.