Friends : అప్పటి వరకూ కలసి మెలిసి తిరిగిన మిత్రుడు దూరమైతే ఎంత బాధ ఉంటుదో అనుభవించిన వారికే తెలుస్తుంది. అలా స్నేహితుడు చనిపోయాడని ఎక్కువ మంది దుంఖసాగరంలో మునిగిపోతారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే .. తమ స్నేహితుడికి గొప్పగా వీడ్కోలు చెప్పాలనుకుంటారు. అలాంటి మిత్ర బృందం గురించే ఇప్పుడు మనం చెప్పుకునేది.
శ్రీలంక అధ్యక్షుడంటే అంత ఈజీ కాదు-ఈ సవాళ్లు దాటితే కానీ గౌరవం దక్కదు
మెక్సికోలో పదహారేళ్ల వయసు ఉన్న ఓ స్నేహితుల బృందం ఉండేది. వీరంతా రెగ్యులర్‌గా ఫుట్‌బాల్ ఆడుకుంటారు. వీరంతా ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే మెక్సికోలో పరిస్థితులు కొంచెం దారణంగా ఉంటాయి. శాంతిభద్రతలు తక్కువ. గ్యాంగ్ వార్స్ కూడా ఎక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బృందంలోని ఓ స్నేహితుడ్ని దుండగులు చంపేశారు. దీంతో ఆ స్నేహితుల టీం గుండె పగిలిపోయింది. అయితే తమ మిత్రుడికి ఘనంగా వీడ్కోలు చెప్పాలనుకున్నారు. అతనితో చివరి గోల్ కొట్టించాలని నిర్ణయించారు.
రిషి సునాక్ ఆస్తి ఎంతో ఎంతో తెలుసా ? బ్రిటన్ కుబేరుల్లో ఆయనది ఎన్నో స్థానం అంటే ?
ఇందు కోసం అందరూ మాట్లాడుకుని.. ఆ యువకుడి కుటంబసభ్యులతో కూడా మాట్లాడి.. శవపేటికను తీసుకుని ఎప్పుడూ తాము ఆడుకునే గ్రౌండ్‌కు తీసుకు వచ్చారు. ఫుట్‌బాల్ ను.. ఆ శవపేటికకు పాస్ చేసి.. దాన్ని తగిలి గోల్‌లోకి వెళ్లేలా చేశారు. దీంతో చనిపోయిన ఆ స్నేహితుడు గోల్ కొట్టినట్లయింది.
అయితే ఇక్కడే గుండెను ద్రవించే సన్నివేసం చోటు చేసుకుంది. గోల్ కొట్టిన తమ స్నేహితుడ్నిచివరి సారిగా అభినందించేందుకు అందరూ ... ఆ శవపేటికను హగ్ చేసుకున్నారు. సాధారణ మ్యాచ్‌లో ఎవరైనా గోల్ కొడితే ఒకరిపై ఒకరు పడి ఎలా హగ్ చేసుకుంటారో అలా చేసుకున్నారు. ఈ దృశ్యం చూసిన వారందరికీ గుండె బరువెక్కింది. తమ మిత్రుడికి వీరంతా ఇస్తున్న చివరి వీడ్కోలను మెక్సికో మీడియా కూడా హైలెట్ చేసింది.
సోషల్ మీడియాలో పెరిగిపోతున్న హిందూ ఫోబియా, యూఎస్ వర్సిటీ స్టడీలో సంచలన విషయాలు