నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈరోజు ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఆయనకు ఫేమ్ వచ్చింది. తన కెరీర్ లో ఎన్నో క్లాస్ అండ్ మాస్ ఫిలిమ్స్ చేశారు ఎన్టీఆర్. స్టార్టింగ్ లో ఆయన చేసిన 'ఆది' సినిమాను ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. ఎన్టీఆర్ లో ఉన్న మాస్ హీరోని ఎలివేట్ చేసిన సినిమా అది. దర్శకుడు వి.వి.వినాయక్ 'ఆది' సినిమా తీశారు. అయితే నిజానికి ఎన్టీఆర్ తో లవ్ స్టోరీ చేయాలనుకున్నారట ఈ డైరెక్టర్.


కానీ కొడాలి నాని ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. చాలా ఏళ్ల పాటు రాసుకున్న 'శ్రీ' అనే ప్రేమకథను రూ.30 లక్షల్లో తీయాలని అనుకున్నారట వినాయక్. నిర్మాత బుజ్జికి కథ నచ్చడంతో ఆయన ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లారట. కానీ ఎన్టీఆర్ కి అసలు కథ వినే ఇంట్రెస్ట్ కూడా లేదట. 


20 నిమిషాల్లో కథ చెప్పగలరా..? అని వినాయక్ ని అడిగారట ఎన్టీఆర్. ఇంట్రడక్షన్ చెబుతాను.. మీకు నచ్చితే మిగిలిన కథ కంటిన్యూ చేస్తానని వినాయక్ అన్నారట. ఐదు నిమిషాల్లో వినాయక్ చెప్పిన ఇంట్రడక్షన్ ఎపిసోడ్ ఎన్టీఆర్ కి నచ్చడంతో రెండు గంటలు స్పెండ్ చేసి కథ విన్నారట. ఫైనల్ గా ఓకే అనుకున్నాక.. కొడాలి నాని ఎంటర్ అయ్యాడని.. లవ్ స్టోరీస్ వద్దని ఎన్టీఆర్ తో చెప్పాడని గుర్తు చేసుకున్నారు వినాయక్. 


ఆ డైరెక్టర్ తో మనకెందుకులే అని కూడా అన్నాడని వినాయక్ చెప్పారు. ఆ తరువాత ఎన్టీఆర్ ని చాలా సార్లు కలిశానని.. సినిమాకి నో చెప్పడానికి అతడు బాగా ఇబ్బంది పడ్డాడని.. ఆ సమయంలో ఒక ఛాన్స్ ఇవ్వు, వేరే కథ చెబుతానని అడిగానని వినాయక్ పేర్కొన్నారు.  అప్పుడే రెండు రోజుల్లో 'ఆది' కథ చెప్పానని.. కొడాలి నాని అండ్ టీమ్ కూడా ఉందని అందరూ స్పెల్ బౌండ్ అయ్యారని వినాయక్ చెప్పుకొచ్చారు. 


ఆ తరువాత ఎన్టీఆర్ తో 'సాంబ', 'అదుర్స్' లాంటి సినిమాలు తెరకెక్కించారు వినాయక్. ప్రస్తుతం ఈ డైరెక్టర్ జోరు కాస్త తగ్గింది. చివరిగా 'ఇంటెలిజెంట్' అనే ప్లాప్ సినిమా తీశారాయన. ప్రస్తుతం బాలీవుడ్ లో బెల్లంకొండ హీరోగా 'ఛత్రపతి' రీమేక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. 


Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత


Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్