Indian billionaire insulted by Rolls Royce :  దుబాయ్‌లోని రోల్స్ రాయిస్ కార్ల షోరూంలోకి ఓ పెద్దాయన  వెళ్లాడు. కానీ ఆయన సాదాసీదాగా ఉండటం చూసి.. ఆ షోరూం సిబ్బంది ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. రోల్స్ రాయిస్ కార్లు కొనేంత ధనవంతుడు కాదని భావించి ఆయనను అవమానించారు. దగ్గర్లోని మిత్సుబిషి షోరూంకు వెళ్తే మీ స్థాయి వారికి లగ్జరీ కార్లు వస్తాయని హేళనగా మాట్లాడారు. అయితే ఈ మాటలతో మరింత పట్టుదలకుపోయిన ఆయన అక్కడిక్కడ వెంటనే రోల్స్ రాయిస్ కారుని కొనేశారు. కానీ అదే కారును తాను వాడలేదు.  జాయ్ అలుక్కాస్ బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్న బంపర్ డ్రాలో ఫస్ట్ ప్రైజుగా పెట్టేశారు. 


రోల్స్ రాయిస్ షోరూంలో జాయ్ అలుక్కాస్‌కు  అవమానం                  


ఇంతకీ ఆ కారును కొనుగోలు చేసింది ఎవరంటే.. జాయ్ అలుక్కాసే. తన పేరు మీద జ్యూయలరీ బ్రాండ్ ను ఏర్పాటు చేసిన ఆయన.. బారీగా వ్యాపారం చేస్తూంటారు. దేశంలోని టాప్ 50 ధనవంతుల్లో ఒకరు. కానీ ఆయన సాదాసీదాగా ఉండటం చూసి.. కారు షోరూం సిబ్బంది అవమానించారు. ఆ అవమానంతోనే కారు కొని.. తన షోరూంలో బంగారం కొనేవారికి పెట్టిన స్కీములో  బంపర్ డ్రా మొదటి ప్రైజుగా ఆ కారును పెట్టేశారు. ఇప్పుడు జాయ్ అలుక్కాస్ దగ్గర... లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. అందులో రోల్స్ రాయిస్ లెటెస్ట్ ఎడిషన్ కలినాన్ కూడా ఉంది.త దీని విలువ ఆరు కోట్ల రూపాయలని అంచానా. 


కోల్‌కతా పోలీస్ క‌మిష‌న‌ర్ పేరుతో అత్యాచార నిందితుడి బైకు రిజిస్ట్రేష‌న్‌!


జాయ్ అలుక్కాస్ వద్ద ఎన్నో లగ్జరీ కార్లు             


తనకు ఎదురైన అనుభవాలను జాయ్ అలుక్కాస్ ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. లగ్జరీ కార్లు అంటే తనకు ఎంతో ఇష్టమైనప్పటికీ.. ఆ అనుభవ తర్వాత మనసు మార్చుకునే ప్రయత్నం చేశానని అంటున్నారు. కానీ.. తర్వాత ఆయన వ్యాపారం దేశ విదేశాలకు విస్తరించడంతో.. లగ్జరీ కార్ల కోరికను తీర్చుకుంటున్నారు. ఎంత డబ్బులు  సంపాదిచినా ఎలా సింపుల ఉండవచ్చో ఆయన నిరూపిస్తున్నారు.  


బిలియనీర్ల మొదటి చాయిస్ రోల్స్ రాయిస్         


రోల్స్ రాయిస్ కార్లు మొదటి నుంచి సమాజంలో పలుకుబడి ఉన్న  వారికే విక్రయిస్తారని చెబుతారు. కేవలం డబ్బు ఉంటే సరిపోదని ఆ కారును సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు మాత్రమే వాడాలని ఆ కంపెనీ ప్రతినిధులు కోరుకుంటారని చెబుతారు. ఓ సారి నిజం రాజు ఇలా రోల్స్ రాయిస్ కారును అతి  కష్టం మీద కొvgగోలు చేసిన ఆయన దాన్ని విచిత్రమైన పనులకు ఉపయోగించేవాడని చెబుతారు. ఇప్పుడు రోల్స్  రాయిస్ కార్లు.. విరివిగా లభ్యమవుతున్నాయి. సమాజంలో బాగా డబ్బు సంపాదిచిన  వారు సులువుగా రోల్స్ రాయిస్ కార్లను కొనేస్తున్నారు.