Actress Anjali Ameer Shocking Comments on Actor Suraj Venjaramoodu: మలయాళ సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌పై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ఇతర ఇండస్ట్రీలో వాళ్లే కాదు మలయాళ ఇండస్ట్రీలో నటీనటులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మరికొందరు నటీమణీలు కూడా మేల్‌ యాక్టర్స్‌ నుంచి తమకు ఎదురైన చేదు అనుభవాలపై నోరువిప్పుతున్నారు. తాజాగా మలయాళ తొలి ట్రాన్స్‌జెండర్‌ నటి అంజలి అమీర్‌ ఓ స్టార్‌ నటుడు నుంచి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడింది.


ప్రముఖ నటుడు, నేషనల్‌ అవార్డు విన్నర్‌ సూరజ్ వెంజరమూడ్ వల్ల తనకు ఓసారి ఇబ్బందికర సిచ్య్చువేషన్‌ చూశానంది. "2018లో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించిన 'పెరున్బు' అనే తమిళ సినిమాలో నేను ముఖ్యపాత్ర పోషించాను. ఆ సినిమాలో  సూరజ్ వెంజరమూడ్ కూడా ఉన్నారు. అదే సమయంలో ఆయన నుంచి నాకు ఒక అభ్యంతరకరమైన ప్రశ్న ఎదురైంది. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు స్త్రీలలాగా ఎలా సుఖం పొందుతారని ఆయన నన్ను అడిగారు. అది నేను షాక్‌కు గురయ్యాను. ఆయన నుంచి అలాంటి ప్రశ్న రాగానే చాలా ఇబ్బందిగా అనిపించింది.


ఇంతముందేన్నడు నన్ను ఎవరూ అలా ప్రశ్నించలేదు. ఆయన అలా అడిగేంతవరకు ముందేన్నడు నేను ఇలాంటి ఇబ్బందికర అనుభవాలను కూడా ఎదుర్కొలేదు. ఆయన అలా అడగడంతో నాకు చాలా కోపం వచ్చింది. దీంతో వెంటనే ఆయనను హెచ్చరించాను. అలాగే మమ్ముట్టి సార్‌కి ఆ సినిమా డైరెక్టర్‌కి వెళ్లి చెప్పాను. దాంతో వెంటనే సూరజ్ వెంజరమూడ్ క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు మళ్లీ నాతో అలా మాట్లాడలేదు. చాలా వినయంగా మసులుకున్నారు. ఇందుకు ఆయనను నేను అభినందిస్తున్నా" అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది ఇతరుల పట్ల గౌరవంగా ఉంటారని, అన్ని విభాగాల్లో మాదిరి ఇక్కడ కూడా మంచివాళ్లతో పాటు చెడువాళ్లు కూడా ఉన్నారని పేర్కొంది.



అయితే ఇక్కడ కొందరు మాత్రమే కాంప్రమైజ్‌లు, ఫేవర్‌లు అడిగేవాళ్లు ఉన్నారని ఆమె తెలిపారు. కాగా సూరజ్ వెంజరమూడ్ తాజాగా GRR చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ అందుకుంటుంది. తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే అంతకుముందే సూరజ్ వెంజరమూడ్ తెలుగు ఆడియన్స్‌కి పరిచయమే. ది గ్రేట్ ఇండియన్ కిచెన్, జనగణమన, డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాలతో ఆయన తెలుగులో గుర్తింపు పొందారు. 



అలాగే నాగేంద్రన్స్ హానీమూన్స్‌ వెబ్‌ సిరీస్‌తోనూ ఆయన తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు.  కాగా ఓ నటిపై స్టార్‌ హీరో అతడి అనుచరులు చేసిన లైంగిక దాడి నేపథ్యంలో ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌పై కేరళ ప్రభుత్వం 2017లో మాజీ జస్టీస్‌ హేమ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఇందులో సీనియర్‌ నటి శారదతో పాటు పలువురు ఉన్నారు. ఈ కమిటీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వెల్లడిస్తూ నివేదిక ప్రభుత్వానికి అందించింది. ఈ రిపోర్టులో బాధిత నటీమణులు వాంగ్మూలనం కూడా ఈ కమిటీ పొందుపరించింది. 


Also Read: క్లింకార ఫస్ట్‌ కృష్ణాష్టమి - పూజలో మెగా వారసురాలు, ఎంత క్యూట్‌గా ఉందో చూడండి!