Kangana Ranaut has become a problem for BJP: బాలీవుడ్  హీరోయిన్ కంగనా రనౌత్ రెబల్ గా గుర్తింపు పొందారు. బాలీవుడ్‌లో ఆమె కీలక వ్యక్తులపై ఆరోపణలు చేసి పోరాడారు. మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంపైనా విమర్శలు చేయడంతో కోట్లు పెట్టి నిర్మించుకున్న తన కార్యాలయాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీకి, మోదీకి పూర్తి స్థాయిలో మద్దతురాలిగా ఉంటున్న ఆమెకు  బీజేపీ సిమ్లా టిక్కెట్ ఇచ్చింది. రాజకీయ ఆరంగేంట్ర చేసిన ఆమె.. విజయం సాధించారు. అయితే సినీ నటిగా ఉన్నప్పుడు చేసిన రచ్చ కన్నా.. ఇప్పుడు రాజకీయ నేతగా రాజకీయం చేయాల్సి ఉన్నా.. ఆమె పాత పద్దతిలోనే ఉంటూడటంతో బీజేపీకి సమస్యగా మారింది. 


రైతుల ఉద్యమంపై పదే పదే అనుచిత వ్యాఖ్యలు   


రైతులపై పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కంగనా రనౌత్ కు బీజేపీ హైకమాండ్ తాజాగా షాకిచ్చింది. రైతులపై మోదీ ప్రభుత్వం కఠినంగా ఉండట్టే ఇండియా ప్రశాంతంగా ఉందని లేకపోతే బంగ్లాదేశ్ చేసి ఉండేవారని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె చేసిన ప్రకటన ప్రజల్లో తీవ్ర చర్చకు రాక ముందే బీజేపీ స్పందించింది. ఆమె మాటలతో బీజేపీకి సంబందం లేదని బీజేపీ తరపున మాట్లాడేందుకు ఆమెకు ఎలాంటి అధికారం ఇవ్వలేదని స్పష్టం చేిసంది. దీనికి కారణం హర్యానా ఎన్నికలు జరుగుతూండటమే. ఢిల్లీ శివార్లలో రైతులు చేసిన ఉద్యమంలో అత్యధిక మంది హర్యానాకు చెందిన వారే. 


బీజేపీకి సమస్యగా మారుతున్న కంగనా                               


ఎంపీగా గెలిచి తర్వాత ఢిల్లీకి వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో ఓ సీఐఎస్ఎఫ్ మహిళా జవాను కంగనా రనౌన్ చెంప చెళ్లుమనిపించారు.  గతంలో రైతులకు వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగానే.. రైతు బిడ్డగా తాను ఈ దాడి చేశానని చెప్పారు. ఆ సమయంలో.. కంగనాకు పెద్దగా బయట నుంచి కూడా మద్దతు లభించలేదు. ఎందుకంటే రైతులపై ఆమె ప్రయోగించిన భాష పూర్తి గా అనుచితం. అయినా తర్వాత కూడా కంగనా రనౌత్ తన తీరు మార్చుకోలేదని తాజాగా స్పష్టంగ అయింది. కంగనా వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందికరంగా మారుతాయని క్లారిటీ రావడంతో బీజేపీ వెంటనే వివరణ ఇచ్చింది. 


రాజకీయ నాయకురాలిగా ఆలోచంచలేకపోతున్న కంగనా రనౌత్ 


కంగనా రనౌత్ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎంపీ. గతంలో ఎలా ఉన్నా. ఇప్పుడు మాత్రం ఆమె సంపూర్ణ రాజకీయ నేతగా వ్యవహరించాల్సి ఉంటుది. బీజేపీ ఎంపీగా ఆమె మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఆమెకే కాదు.బీజేపీకి కూడా నష్టం జరుగుతుంది. అందుకే.. ఆమె మీడియాతో మాట్లాడవద్దని బీజేపీ పెద్దలు కోరుతున్నారు. తాజాగా కంగనా రనౌత్ చేిసన వ్యాఖ్యలతో  బీజేపీ ఆమెను మరింత దూరం పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె వల్ల హర్యానా ఎన్నికల్లో నష్టపోకూడదని  బీజేపీ కోరుకుంటోంది.