Wrestlers Protest:
పోలీసుల నోటీసులు..
WFI చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లను సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలని ఢిల్లీ పోలీసులు అడిగారు. ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లతో మాట్లాడిన పోలీసులు "ఎవిడెన్స్" కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆయన లైంగికంగా వేధించాడు అనడానికి సాక్ష్యంగా ఫోటోలు, వీడియోలు లేదంటే ఆడియో క్లిప్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలని ఇద్దరు మహిళా రెజ్లర్లకు చెప్పారు. వాటిని ఆధారాలతో సహా ఇస్తేనే కేసు బలంగా ఉంటుందని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే ఓ రిపోర్ట్ కూడా తయారు చేశారు ఢిల్లీ పోలీసులు. బ్రిజ్ భూషణ్ చాలా సార్లు బలవంతంగా హగ్ చేసుకున్నాడని రెజ్లర్లు ఆరోపించారు. దీనికీ ఎవిడెన్స్ ఉందా అని ప్రశ్నించారు. ఈ ఏడాది ఏప్రిలే 21వ తేదీన ఇద్దరు మహిళా రెజ్లర్లు తమ స్టేట్‌మెంట్ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. CRPC సెక్షన్ 91 కింద ఈ రెజ్లర్లకు నోటీసులిచ్చారు పోలీసులు. "ఆరోపణలకు సంబంధించి ఏ సాక్ష్యం ఉన్న కచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే" అని తేల్చి చెప్పారు. బ్రిజ్ భూషణ్ బెదిరింపు కాల్స్ కూడా చేశారన్న ఆరోపణలకూ ఆధారాలు అడిగారు. ఫోటోలు, కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్‌లు ఏమైనా ఉంటే ఆ వివరాలు ఇవ్వాలని తెలిపారు. అటు రెజ్లర్లు మాత్రం ఢిల్లీ పోలీసుల తీరుని తప్పుపడుతున్నారు. కావాలనే కేసులని తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడుతున్నారు. తమ స్టేట్‌మెంట్‌లు వెనక్కి తీసుకోవాలంటూ కొందరు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు.
కేంద్రంతో చర్చలు జరుగుతున్న తరుణంలో రెజ్లర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. Asian Gamesలో ఆడతారా లేదా అన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చింది రెజ్లర్ సాక్షి మాలిక్. సోనిపట్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె...ప్రస్తుత సమస్య పరిష్కారం అయ్యాకే ఆ గేమ్స్‌లో పాల్గొంటామని తేల్చి చెప్పింది. తాము ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నామో ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 15లోగా బ్రిజ్ భూషణ్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
"మా డిమాండ్‌లు తీర్చినప్పుడు, సమస్యలు పరిష్కారమైనప్పుడే ఏషియన్ గేమ్స్‌లో ఆడతాం. రోజూ మేము ఎంత మానసిక వేదనకు గురవుతున్నామో ఎవరికీ అర్థం కావడం లేదు"
- సాక్షి మాలిక్, రెజ్లర్
అంతకు ముందు రోజు రెజ్లర్ సంగీత ఫోగట్ బ్రిజ్ భూషణ్ ఇంటికి వెళ్లడం ఉత్కంఠ రేపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఆమెని "రీకన్‌స్ట్రక్షన్" కోసం పిలిచారు పోలీసులు. బ్రిజ్ భూషణ్ ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తించాడు అని వివరించాలని అడిగారు. ఆమెతో పాటు మహిళా పోలీసులు వెళ్లారు. ఢిల్లీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి మధ్యాహ్నం వెళ్లిన సంగీత ఫోగట్ దాదాపు అరగంట తరవాత బయటకు వచ్చారు. ఇప్పటికే కేంద్రం ఈ ఆరోపణలను విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని నియమించింది. వచ్చే వారం నాటికి తమ రిపోర్ట్‌ని కోర్టులో సమర్పించనుంది.
Also Read: Rajiv Gandhi Case: అమ్మని చూడాలనుంది దయచేసి ఇంటికి పంపండి - రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి లేఖ