World Bank:


ప్రపంచ బ్యాంక్ నివేదిక..


భారత్‌లోని డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ప్రపంచ బ్యాంక్ (World Bank) ప్రశంసించింది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) ద్వారా 47 ఏళ్లలో సాధించాల్సింది కేవలం ఆరేళ్లలనో సాధించారని కితాబునిచ్చింది. దీనిపై ఓ నివేదికను కూడా విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జరిగిన UPI Transactions విలువ దేశ జీడీపీలో 50% మేర ఉన్నట్టు ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. బ్యాంక్‌లు కస్టమర్స్ కోసం పెట్టే ఖర్చు కూడా భారీగా తగ్గిందని వెల్లడించింది. 23 డాలర్ల నుంచి 0.1 డాలర్లకు పడిపోయిందని నివేదించింది. ఇదంతా DPI వల్లే అని తేల్చి చెప్పింది. 2022 మార్చి నాటికి భారత్ 33 బిలియన్ డాలర్ల మేర సేవింగ్స్ చేసుకోగలిగిందని, ఇది GDPలో 1.14%తో సమానమని వివరించింది. ఇది Direct Benefit Transfer (DBT) ద్వారానే ఇది సాధ్యమైందని స్పష్టం చేసింది.  G20 Global Partnership for Financial Inclusion (GPFI) పేరిట ఓ డాక్యుమెంట్‌ని తయారు చేసింది ప్రపంచ బ్యాంక్. భారత ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ డాక్యుమెంట్‌ని రూపొందించింది. G20 సదస్సులో డిజిటల్ భారత్ నినాదాన్ని గట్టిగా వినిపించాలనుకుంటున్న భారత్‌కి ఈ నివేదిక మరింత జోష్‌ ఇచ్చింది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 47ఏళ్లలో సాధించాల్సింది కేవలం ఆరేళ్లలోనే సాధించామంటూ ప్రపంచ బ్యాంక్ నివేదించిందని వెల్లడించారు. 


"కేవలం ఆరేళ్లలో 80% మేర డిజిటల్ లావాదేవీలు జరిగే స్థాయికి భారత్ చేరుకుంది. ఈ ఘనత సాధించాలంటే కనీసం 5 దశాబ్దాలు పడుతుంది. కానీ...ఇండియా మాత్రం ఆరేళ్లలోనే సాధించింది. ఇదంతా DPI వల్లే. ఆధార్, జన్‌ధన్ బ్యాంక్‌తో పాటు మొబైల్ ఫోన్స్ కూడా ఈ ఘనత సాధించడంలో ఎంతో తోడ్పడ్డాయి"


- ప్రపంచ బ్యాంక్ నివేదిక 




2015 మార్చిలో Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) ఖాతాల సంఖ్య 2022 నాటికి 46.2 కోట్లకు పెరిగింది.  ఇందులో మహిళలకే 56% మేర అకౌంట్‌లున్నాయి. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఆధార్‌ని తప్పనిసరి చేయడమూ కలిసొచ్చింది. UPIకి భారత దేశ ప్రజలు చాలా తొందరగా అలవాటు పడ్డారని ప్రపంచబ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది. ఆధార్ (Aadhar), డిజీలాకర్ ‍‌(Digilocker), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వంటి భారతదేశం సాధించిన డిజిటల్‌ అచీవ్‌మెంట్స్‌ గురించి G20 ప్రతినిధులకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ET రిపోర్ట్‌ ప్రకారం, సదస్సు సందర్భంగా ప్రతినిధులందరికీ UPI ద్వారా డబ్బు పంపాలని సెంట్రల్‌ గవర్నమెంట్‌ యోచిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే జీ20 సదస్సులో 1000 మందికి పైగా డెలిగేట్స్‌ పాల్గొనే అవకాశం ఉందని సీనియర్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. వాళ్లందరి కోసం కేంద్ర ప్రభుత్వం వాలెట్లను తయారు చేస్తోంది. సమ్మిట్‌ జరుగుతున్న సమయంలో, యూపీఐ ద్వారా ప్రతి ఒక్కరి వాలెట్‌కు వెయ్యి రూపాయలు బదిలీ చేస్తారు. శిఖరాగ్ర వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ డబ్బును డెలిగేట్స్‌ ఉపయోగించుకోవచ్చు.     


Also Read: G20 Summit 2023: G20 సమ్మిట్‌కి వచ్చేదెవరు? డుమ్మా కొట్టేదెవరు? - ఫుల్ లిస్ట్ ఇదిగో