వివిధ వృత్తుల్లో రాణిస్తున్న వారంతా చేసే పనిలో కొన్ని రూల్స్‌కు కట్టుబడి ఉంటారు. వారి లైఫ్‌లో జరిగిన సంఘటనలో లేకుంటే మరో ఇతర కారణాలతో వాటిని అతిక్రమించి ఎప్పుడూ పని చేయరు. కొందరు వైద్యులు రూపాయి తీసుకొనే వైద్యం చేస్తారు. కొందరు లాయర్లు కొన్ని రకాల కేసులు మాత్రమే వాదిస్తారు. వీళ్లంతా సెటాఫ్ రూల్స్ కచ్చితంగా పాటిస్తారు. అలా రూల్స్ పాటించిన ఓ లాయర్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది.
లాయర్ కష్టాలు
గుజరాత్‌కు చెందిన ఓ లాయర్ కూడా ఓ రూల్ పెట్టుకున్నాడు. తనకు తెలిసిన ఓ జంట అకారణంగా విడిపోయింది. ఆ విషయం తెలుసుకున్న అహ్మదాబాద్‌కు చెందిన లాయర్ విడాకుల కేసులను వాదించడం మానేశారు. తన వద్దకు వచ్చిన విడాకుల జంటలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఒక్కటి చేసేవాళ్లు.
138 జంటలను ఒకటి చేసిన లాయర్
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 138 జంటలను కలిపారు ఈ లాయర్. ఇలా విడాకుల కోసం వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం... వారిని ఒప్పించి ఒకటి చేయడానికి ఆయన ఎలాంటి ఫీజు కూడా వసూలు చేసేవారు కాదు. దీంతో ఆయన చాలా ఫేమస్ అయిపోయారు. కానీ ఇదే తన జీవితాన్ని చిక్కుల్లో పడేసింది.
ఇంట్లో ఎదురీత
16 సంవత్సరాల కంటే ఎక్కువ సీనియర్టీ ఉన్న ఈ లాయర్ ఒకట్టి చేసిన జంటలు చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ ఆయనకు తన భార్య నుంచే విడాకులు కోరుతూ నోటీసులు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు పడలేమని ఆయన వల్ల ఇబ్బంది పడుతున్నామని విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు.
ఆర్థిక సమస్యలతో కష్టాలు
లాయర్ తీరుతో కచ్చితంగా విడాకులు కావాలనుకునే జంటలు ఈయన వద్దకు రావడం మానేశారు. దీంతో వేరే కేసులు కూడా రాలేదు. క్రమంగా ఆర్థికంగా చికితిపోయారాయన. ఫలితంగా ఇంటిని నడపడం కష్టమైపోయింది. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. టోటల్‌గా ఫ్యామిలీయే నాలుగు రోడ్ల జంక్షన్‌లో నిలబడాల్సి వచ్చింది.
భరణం వద్దు విడాకులు చాలు
లాయర్‌తో ఉంటే మరిన్ని సమస్యలు తప్పవని గ్రహించిన ఆయన భార్య విడాకులు కోరుతూ నోటీసులు పంపించారు. ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. విడాకులు తీసుకోవాలనుకున్న 138 జంటలను కలిపిన వ్యక్తికి భార్యే విడాకుల నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. తనకు ఎలాంటి భరణం వద్దని... కేవలం విడాకులు ఇస్తే చాలని అంటోంది.
కుమార్తెకు రోల్ మోడల్ తండ్రే
ప్రస్తుతం ఈ దంపతులు విడివిడిగానే ఉంటున్నారు. లాయర్ చదువుతున్న కుమార్తె తల్లితోనే ఉంటోంది. ప్రస్తుతానికి తాను తల్లివద్దే ఉంటాని... విడాకుల ప్రక్రియ పూర్తైన తర్వాత తండ్రి వద్దకు వెళ్తానంటోందామె. తన తండ్రే తనకు రోల్ మోడల్ అని ఆయన వద్దే ప్రాక్టీస్ చేస్తానంటోంది.
Also Read: రోహిత్‌లను పెళ్లి చేసుకుంది, అభిషేక్‌తో తిరుగుతోంది- అశ్విని నకిలీ కథా చిత్రం
Also Read: కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం, వైర్‌లు పట్టుకుని బిల్డింగ్‌పై నుంచి దూకిన విద్యార్థులు