Delhi Coaching Centre: 



ఢిల్లీలో ఘటన..


ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పారు. కోచింగ్ సెంటర్‌లో ఉన్న విద్యార్థులు వైర్‌లు పట్టుకుని కిందకు దిగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిల్డింగ్‌లో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు. ఎవరికీ తీవ్ర గాయాలవ్వలేదని స్పష్టం చేశారు. ఎలక్ట్రిసిటీ మీటర్‌లో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఒక్కసారిగా ఆందోళన చెందారు. పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. ఒక్కసారిగా అందరూ పరుగులు పెట్టారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. 11 మంది సిబ్బంది వెంటనే వైర్‌ల సాయంతో అందరినీ కిందకు తీసుకొచ్చారు. విద్యార్థులందరూ సేఫ్‌గా బయటపడ్డారు. 


"అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కొందరు విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. బిల్డింగ్‌లో ఎవరూ చిక్కుకోలేదు. ఎలక్ట్రిసిటీ మీటర్‌లో లోపం తలెత్తడం వల్ల అగ్నిప్రమాదం జరిగింది. పొగ రావడం వల్ల అంతా ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడింది"


- సుమన్ నల్వా, ఢిల్లీ పోలీస్ పీఆర్వో 


 






ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు.


"ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం. కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. అందరూ సురక్షితంగా ఉన్నారు. ఆందోళన చెందాల్సిన పని లేదు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమైన మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది. జిల్లా అధికారులు కూడా వెంటనే స్పందించారు"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి