Viral Video:
హలాల్ టీ అంటూ ఆరోపణ..
వందేభారత్ రైల్లో హలాల్ టీ సర్వ్ చేయడంపై ఓ ప్యాసింజర్ రైల్వే సిబ్బందితో గొడవ పడిన వీడియో వైరల్ అవుతోంది. హలాల్ సర్టిఫైడ్ టీ ఇచ్చినందుకు అసహనం వ్యక్తం చేసిన ప్యాసింర్ సిబ్బందిని నిలదీశాడు. శ్రావణమాసంలో ఇలాంటివి ఎలా సర్వ్ చేస్తారమని మండి పడ్డాడు. అయితే..రైల్వే సిబ్బంది మాత్రం ఆ ప్యాసింజర్‌కి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అది పూర్తిగా వెజిటేరియన్ ప్రొడక్ట్ అని వివరించారు. "శ్రావణ మాసంలో హలాల్ సర్టిఫైడ్ టీ ఇస్తారా.." అని ప్యాసింజర్ ప్రశ్నించగా అందుకు రైల్వే సిబ్బంది "అంటే ఏంటి" అని అడిగాడు. "మీకు కచ్చితంగా తెలిసే ఉంటుంది. హలాల్ సర్టిఫైడ్ అంటే ఏంటో చెప్పండి. అందరూ ఇది తెలుసుకోవాలి. మనకు ISI సర్టిఫికేట్ ఏంటో తెలుసు. హలాల్ సర్టిఫికేట్ అంటే ఏంటో కూడా చెప్పండి" అని ప్రయాణికుడు నిలదీశాడు. అందుకు రైల్వే ఉద్యోగి "ఇది మసాలా టీ సాచెట్. ఇది పూర్తిగా వెజిటేరియన్ ప్రొడక్ట్" అని వివరించాడు. "మీరు అనవసరంగా వీడియో తీస్తున్నారు. ఛాయ్ అనేది వెజిటేరియన్ సర్" అని అసహనం వ్యక్తం చేశాడు రైల్వే ఉద్యోగి.
వైరల్ అయిన వీడియో..
ఆ తరవాత ప్యాసింజర్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. "నాకు ఎలాంటి సర్టిఫికేషన్‌లు అవసరం లేదు. అలా అనుకుంటే స్వస్తిక్ ముద్ర వేయండి" అని డిమాండ్ చేశారు. కచ్చితంగా ఆలోచిస్తామని రైల్వే ఉద్యోగి సమాధానమిచ్చాడు. ఇలా చాలా సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై మిగతా ప్రయాణికులు కూడా అభ్యంతరం వ్యక్తంచేశారు. టీ సాచెట్స్‌కి కూడా హలాల్ సర్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ప్యాసింజర్‌ని సపోర్ట్ చేయగా..మరి కొందరు రైల్వే ఉద్యోగికి సపోర్టింగ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ప్యాసింజర్ అంతలా నిలదీస్తున్నా..ఏ మాత్రం అసహనానికి గురి కాకుండా చాలా ఓపిగ్గా మాట్లాడాడని ప్రశంసిస్తున్నారు.
హలాల్ అంటే..?
హలాల్ అనే పదం.. అరబ్బీ నుంచి వచ్చింది. హలాల్ అంటే ధర్మబద్ధమైనది లేదా అనుమతించదగినదని అర్థం. ప్రపంచంలోని దాదాపు ముస్లింలు అంతా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ హలాల్ ఆహార పదార్థాల వాణిజ్య మార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా 580 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉందని అంచనా. హలాల్‌కు వ్యతిరేక పదం హరామ్. దీనికి నిషేధించినది, అధర్మమైనది, అనైతికమైనది అని అర్థం ఉంది. ఆహార పదార్థాలకు "హలాల్ సర్టిఫికేట్" ఇచ్చే సంప్రదాయం ముస్లింలలో ఉంది. జంతువుల మాంసాలను, హలాల్ చేసిన తరువాత మాత్రమే తినాలని వారు నమ్ముతారు.
Also Read: నిండా పదేళ్లు లేవు, కానీ 50 దేశాలు చుట్టొచ్చింది - ఒక్క రోజు కూడా స్కూల్ ఎగ్గొట్టలేదు