JDS With BJP:



కలిసి పని చేస్తాం: కుమారస్వామి


2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం మించిపోతోంది. అధికారంలో ఉన్న బీజేపీతో పాటు విపక్షాలన్నీ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే NDA కూటమి ఏర్పాటు కాగా...అదే రోజున విపక్షాలు కూడా కూటమి కట్టాయి. UPA అనే పేరు మార్చి INDIAగా ప్రకటించాయి. ప్రస్తుతానికి 38 పార్టీలు NDAలో ఉండగా...26 పార్టీలు INDIAకి మద్దతునిస్తున్నాయి. అయితే...కొన్ని పార్టీలు మాత్రం ఈ రెండు కూటములకూ దూరంగా ఉన్నాయి. అందులే కర్ణాటక JDS ఒకటి. ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల తరవాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది ఈ పార్టీ. కింగ్‌మేకర్ అవుతామని భావించినా...భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటి నుంచి కుమారస్వామి పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు ఆయనకు NDA నుంచి ఆహ్వానం అందినట్టు సమాచారం. కానీ...కుమారస్వామి మాత్రం ఈ విషయంలో ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటి వరకూ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని కుమారస్వామి...మొత్తానికి క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో కలిసి పని చేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో కలిసేందుకు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. అయితే...NDAలో చేరతారా లేదా అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదని తెలుస్తోంది. ఏ నిర్ణయమైనా తీసుకున్న తనకు ఏం పరవాలేదని కుమారస్వామితో ఆయన చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కుమారస్వామి మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మీడియా ప్రశ్నించినా "లోక్‌సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉందిగా" అని సమాధానమిస్తున్నారు. 


"నేను ఎప్పటి నుంచో ఒకే విషయం స్పష్టంగా చెబుతున్నాను. జేడీఎస్, బీజేపీ అసెంబ్లీ లోపల అయినా, బయట అయినా ప్రతిపక్షాలే. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఒకవేళ కలిసి పని చేయాల్సి వస్తే అందుకు సిద్ధంగానే ఉన్నాం. ఇప్పటికే మా ఎమ్మెల్యేలతో ఈ విషయమై చర్చించాను. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలలే మిగిలున్నాయి. అవి వచ్చినప్పుడు మిగతా నిర్ణయాల గురించి ఆలోచిస్తాం. దేవెగౌడ నాకే ఆ నిర్ణయాన్ని వదిలేశారు. ప్రస్తుతానికి మేం కాంగ్రెస్‌పై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నాం. 10 మంది సభ్యులతో కూడిన కమిటీ కూడా ఏర్పాటు చేశాం"


- కుమారస్వామి, జేడీఎస్ నేత 


వచ్చే ఎన్నికల్లోనూ తామే అధికారం దక్కించుకునేందుకు బీజేపీ చాలానే కష్టపడుతోంది. ఇప్పటి నుంచి అందుకు సంబంధించిన కసరత్తులను కూడా చేస్తోంది. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఎన్నికల్లో గెలిచేందుకు ఏం ఏం చేయాలి వంటి వాటిపై చర్చించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈక్రమంలోనే ఎన్డీఏ ఎంపీలను మొత్తం పది బృందాలుగా విభజించారు. వీరిలో 35 నుంచి 40 మంది పార్లమెంటు సభ్యులు ఉంటారు. జులై 25వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఈ పది బృందాలతో నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే సమావేశాలు నిర్వహించబోతున్నారు. ప్రతీ రోజు 2 గ్రూపులతో ప్రధాని మోదీ భేటీ అయ్యేలా ప్లాన్ చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారికి విజయ సూత్రాలను అందించనున్నారని సమాచారం. విపక్షాలను ఎలా ఎదుర్కోవాలి, వారి సవాళ్లను ఎలా తిప్పికొట్టాలి వంటి అంశాలపై కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. 


Also Read: రాజస్థాన్‌ అసెంబ్లీలో సొంత ప్రభుత్వంపైనే మంత్రి విమర్శలు, పదవి నుంచి తొలగించిన సీఎం