28% GST on Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% జీఎస్‌టీ విధించాలన్న ప్రతిపాదనపై రగడ కంటిన్యూ అవుతోంది. మొదట్నుంచి దీనిని వ్యతిరేకిస్తున్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలన్నీ ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చాయి. జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశాయి.


ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్‌టీ విధించాలని 50వ 'గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ (GST Council) ప్రతిపాదించింది. అప్పట్నుంచీ ఈ విషయంలో గొడవ పెరిగింది. ఈ ప్రతిపాదనపై ఇండియన్‌ కంపెనీలతో పాటు, ఫారిన్‌ ఇన్వెస్టర్లు కూడా గరంగా ఉన్నారు. 30 మంది స్వదేశీ, విదేశీ పెట్టుబడిదార్లు కలిసి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రిక్వెస్ట్‌ లెటర్‌ పంపారు. ఆన్‌లైన్ గేమింగ్ మీద 28 శాతం జీఎస్‌టీ విధిస్తే 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (దాదాపు రూ.20,500 కోట్లు) వెనక్కు వెళ్లిపోతాయని ఆ లెటర్‌లో లెక్క చెప్పారు. 


పీక్ XV క్యాపిటల్, టైగర్ గ్లోబల్, డీఎస్‌టీ గ్లోబల్, బెనెట్, కోల్‌మన్ & కంపెనీ లిమిటెడ్, ఆల్ఫా వేవ్ గ్లోబల్, క్రిస్ క్యాపిటల్, లుమికై వంటి లోకల్‌, ఫారిన్‌ కంపెనీలు ఈ గ్రూప్‌-30లో ఉన్నాయి. 


గ్రూప్‌-30 లేఖలో ఉన్న మ్యాటర్‌ ఇది
"వచ్చే 3-4 ఏళ్లలో ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు 4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 32,800 కోట్లు) చేరుకుంటాయి. ఆన్‌లైన్‌ గేమింగ్‌కు ఆదరణ పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో 28 శాతం GST విధిస్తే ఇండస్ట్రీ మొత్తం నెగెటివ్‌గా ఎఫెక్ట్‌ అవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో చెత్త & కష్టతరమైన వ్యవస్థ అమల్లోకి వస్తుంది. దీని వల్ల, ఈ పరిశ్రమ నుంచి దాదాపు రూ.20,500 కోట్లు వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది. ఇండియన్‌ టెక్నాలజీ లేదా ఎమర్జింగ్‌ సెక్టార్‌ మీద ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఇది చెరిపేస్తుంది. జీఎస్‌టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయం మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. కౌన్సిల్‌ ప్రతిపాదన అమల్లోకి వస్తే గేమింగ్ ఇండస్ట్రీ భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. జీఎస్టీ భారం 1,100 శాతం పెరుగుతుంది. ప్రైజ్‌ మనీ గెలిచిన కస్టమర్‌ ఒక రూపాయికి 50 పైసల నుంచి 70 పైసల వరకు పన్ను టాక్స్‌ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంలో ప్రధాని నేరుగా జోక్యం చేసుకోవాలి". 


గత వారంలో కూడా, 127 ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశాయి. ఫుల్‌ డిపాజిట్ వాల్యూ మీద 28 శాతం జీఎస్‌టీ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని సూచించాయి. స్కిల్ గేమింగ్‌ను బెట్టింగ్ & గ్యాంబ్లింగ్‌తో కలిపి చూడొద్దని రిక్వెస్ట్‌ చేశాయి. కౌన్సిల్‌ నిర్ణయం వల్ల MSMEలు, స్టార్టప్‌లు విపరీతమైన ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వ్యాపారాలు మూసేయాల్సి రావచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఓపెన్‌ లెటర్‌ రాసిన 127 కంపెనీల్లో, స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన నజారా టెక్నాలజీస్‌ కూడా ఉంది. దీంతో పాటు.. బాజీ గేమ్స్‌, దంగల్ గేమ్స్, గేమ్‌స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్, విన్‌జో గేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రామినెంట్‌ పేర్లు కూడా ఉన్నాయి.


ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్‌టీ విధించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాnvf తన మంత్రిత్వ శాఖ జీఎస్టీ కౌన్సిల్‌ను కోరుతుందని కేంద్ర సమాచార, సాంకేతికత శాఖ సహాయ మంత్రి రాజీవ్ రీసెంట్‌గా ప్రకటన చేశారు. 


మరో ఆసక్తికర కథనం: నష్టాలు తగ్గించి నమ్మకం నిలబెట్టుకున్న పేటీఎం, Q1లో బిజినెస్‌ బజ్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial