గతంలో తులసి తీసుకొచ్చిన షర్ట్ ని అవమానించి లాస్య తీసుకొచ్చిన షర్ట్ బాగుందని చూడగానే ముద్దు వస్తుందని మెచ్చుకున్న విషయం నందు గుర్తు చేసుకుంటాడు. తన మాటలతో తులసిని బాధపెట్టినందుకు ఫీల్అవుతాడు. ఈరోజు ఈ షర్ట్ వేసుకుని నా కళ్లలోని పశ్చాత్తాపం తెలిసి వచ్చేలా చేస్తానని తులసి కొన్న షర్ట్ వేసుకుంటాడు. కానీ షర్ట్ పట్టక గుండీ ఊడిపోతుంది. ఇంతగా బలిశానా అనుకుని ఎలాగైనా డైట్ చేసి ఒళ్ళు తగ్గించుకుని షర్ట్ పట్టేలా చేసుకోవాలని అనుకుంటాడు. తులసి కిచెన్ లో పని చేసుకుంటుంటే నందు దొంగలాగా చూస్తూ ఉంటే పరంధామయ్య వెనుక నుంచి వచ్చి ఒక్కటిస్తాడు. అప్పుడే రాములమ్మ కిచెన్ లో నుంచి వస్తే తనని ఆపుతాడు.
నందు: తన చొక్కా చిరిగిపోతుందని తిక్క తిక్కగా మాట్లాడతాడు
పరంధామయ్య: ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు
నందు: ఈరోజు నుంచి నేను తినే తిండి మొత్తం నేను చెప్పినట్టే ఉండాలి. పూర్తిగా మారిపోవాలి.
Also Read: కృష్ణని ప్రేమగా మెచ్చుకున్న భవానీ- అమ్మా కొడుకుని మడతేట్టిసిన ముకుంద
రాములమ్మ: తను ఏం చేయాలనుకున్న తులసమ్మ పర్మిషన్ ఉండాలి
నందు: నేను డైట్ ఫాలో అవుతాను ఏం కావాలో రాసిస్తాను ఫాలో అయిపో
రాములమ్మ: నందు బాబు సన్నబడి ఎవరి కలలోకి వెళ్దామని
పరంధామయ్య: కలలోకి కాదు రాములమ్మ ఇప్పుడే కథ మొదలైంది
రాజ్యలక్ష్మి హాస్పిటల్ కి వెళ్లేందుకు సంజయ్ ని పిలుస్తుంది. అదేంటి హాస్పిటల్ కి వెళ్తున్నావని బసవయ్య అడుగుతాడు. ఇంట్లో దివ్య, విక్రమ్ ఆరాచకాలు చూడలేక చస్తున్నా అందుకే హాస్పిటల్ కి వెళ్ళి ప్రశాంతంగా ఉందామని వెళ్తున్నట్టు చెప్తాడు. ఇది కేవలం విశ్రాంతి మాత్రమేనని మళ్ళీ దివ్య మీద పగ తీర్చుకుంటానని అంటుంది. వాళ్ళు వెళ్లబోతుంటే విక్రమ్ వస్తాడు. దివ్య వచ్చి పదండి హాస్పిటల్ కి వెళ్దామని అంటుంది.
విక్రమ్: అమ్మా నీ కోడలు కూడా నీతో హాస్పిటల్ కి వస్తుంది
రాజ్యలక్ష్మి: ఇప్పుడే దివ్య హాస్పిటల్ కి రావలసిన అవసరం ఏముంది? డాక్టర్ కి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా
సంజయ్: ఎలాగూ తన ప్లేస్ లో వేరే డాక్టర్ ని తీసుకున్నాం ప్రాబ్లం ఏమి లేదు
రాజ్యలక్ష్మి: విక్రమ్ ఫస్ట్ నైట్ ముహూర్తానికి టైమ్ కలిసి రాక చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంకొద్ది రోజులు దివ్య ఇంటి దగ్గర ఉంటూ కొత్త జీవితాన్ని ఎంజాయ్ చెయ్యమను. కొన్ని రోజుల తర్వాత బాధ్యతలు మీద పడతాయి
దివ్య: అత్తయ్య ఈ వయసులో కష్టపడుతుంటే నేను ఇంట్లో తిని పడుకుంటే ఏం బాగుంటుంది. మీరు ఏం అనుకొకపోయినా చూసే జనాలు ఏమనుకుంటారు
లాస్య: మీ అమ్మ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు నీకు చెప్పకూడదు అనుకుంది కానీ దివ్య మొండితనం వల్ల చెప్పాల్సి వస్తుంది. మీ ఫస్ట్ నైట్ అవగానే మిమ్మల్ని హనీ మూన్ పంపించాలని ప్లాన్ చేసింది. ఏ ప్లేస్ కి
రాజ్యలక్ష్మి: యూరప్ ప్లాన్ చేశాను. హనీ మూన్ అయిపోయాక దివ్య హాస్పిటల్ కి రావొచ్చు. ఆ తర్వాత తనకి బాధ్యతలు అప్పగించి ఇంట్లోనే ఉంటాను
Also Read: కావ్య మనసుకి తీరని గాయం చేసిన రాజ్- ధాన్యలక్ష్మిని దారుణంగా అవమానించిన స్వప్న
విక్రమ్: ఈ మాట ముందే చెప్పి ఉంటే అసలు దివ్య హాస్పిటల్ కి రెడీ అయ్యేది కాదు
అప్పుడే తులసి, నందు ఎంట్రీ ఇస్తారు. దివ్యతో మాట్లాడటానికి వచ్చారని లాస్య వెటకారంగా అంటుంది. దీంతో నందు సంబంధం లేని వాళ్ళు జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుందని కౌంటర్ వేస్తాడు.
తులసి: మొదటి రాత్రి అత్తింట్లో జరిగింది, మిగతా రెండు రాత్రులు పుట్టింట్లో జరపాలి. అది మా ఆచారం
రాజ్యలక్ష్మి: ఏ ఒక్కరూ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని మనసులో అనుకుంటుంది. హాస్పిటల్ కి వెళ్లాలని ఆలోచించుకుని చెప్తాను
నందు: మాతో పాటు తీసుకుని వెళ్దామని వచ్చాం
దివ్య: రావడానికి మాకేం ఇబ్బంది లేదు పైగా హాస్పిటల్ కి కూడా వెళ్ళడం లేదు
రాజ్యలక్ష్మి: విక్రమ్ తో మాట్లాడి చెప్తాను
లాస్య: పిల్లల్ని హనీ మూన్ పంపించాలని డిసైడ్ చేశాం. దాని గురించి మాట్లాడి డిసైడ్ చేయాలి
తులసి: మేం తీసుకెళ్ళేది రెండు నిద్రల కోసమే ఈలోపు ఫోన్లో కూడా మాట్లాడుకోవచ్చు
నందు: సరే అయితే మీరు కూడా మా ఇంటికి రండి అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చు
విక్రమ్: వచ్చే రెండు రోజుల్లో హనీ మూన్ కి వెళ్ళేది లేదు కదా మేం అత్తయ్య వాళ్ళతో వెళ్తాం
రాజ్యలక్ష్మి: ఇప్పుడు యమగండం నడుస్తుంది. తర్వాత నేనే పంపిస్తాను