Vice President Candidate :  విపక్ష పార్టీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు చేశాయి. మార్గరెట్ అల్వా పేరును విపక్షాల తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాయి. ఆదివారం దిల్లీలో సమావేశమైన విపక్ష పార్టీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించాయి. కర్నాటకకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అల్వా పేరును ఫైనల్ అయింది. విపక్షాల పార్టీల సమావేశం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. మార్గరెట్ అల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. పశ్చిమ బెంగాలు గవర్నర్ జగ్ దీప్ ధన్ ఖర్ ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. 






మార్గరెట్ అల్వా ప్రస్థానం


మార్గరెట్ అల్వా ఏప్రిల్ 14, 1942 లో జన్మించారు. ఆమె గోవా, గుజరాత్‌, రాజస్థాన్, ఉత్తరాఖండ్ గవర్నర్ గా పనిచేశారు. ఆమె కేబినెట్ మంత్రిగా పనిచేశారు. మార్గరెట్ అల్వా కాంగ్రెస్ సీనియర్ నేత, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా ఆమె పనిచేశారు. ఆమె అత్తగారు వైలెట్ అల్వా, 1960లలో రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. మార్గరెట్ అల్వా 14 ఏప్రిల్ 1942లో కర్ణాటకలోని మంగళూరులో రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఆమె బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల నుంచి బీఏ పట్టా పొందారు. ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయ పట్టా పొందారు.


ఆగస్టు 16న ఉపరాష్ట్రపతి ఎన్నిక


ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగష్టు 10వ తేదీతో ముగుస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం ఆగష్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. జులై 19వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసినందుకు అవకాశం ఉంది.