కరోనా వ్యాప్తి సమయంలో ప్రపంచంలో పలు దేశాలను ఆపన్న హస్తం అందించింది భారత్. ఎన్నో దేశాలకు తమ వంతుగా కోవిడ్19 వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఈ క్రమంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది. దేశంలో 200 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. జనవరి 16, 2021న భారత్‌లో కరోనా వైరస్ కు వ్యాక్సినేషన్ ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ  ప్రారంభమైన 18 నెలల కాలంలోనే భారత్ 200 కోట్ల డోసుల కరోనా వ్యాక్సినేషన్ మార్కును అదిగమించింది. 


ప్రధాని మోదీ ఏమన్నారంటే..
‘భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. 200 కోట్ల డోసుల కొవిడ్19 వ్యాక్సినేషన్ దాటిన సందర్భంగా భారతీయులందరికీ అభినందనలు. భారతదేశం కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను యుద్ధప్రాతిపదికన నిర్వహించింది. చాలా వేగంగా భారత్ ఈ ఘనతను సాధించడం ఎంతో గర్వకారణం. ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై పోరులో ఆపన్న హస్తం అందించి వైరస్ పై పోరులో విజయాన్ని సాధించామని’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.






కరోనా వ్యాక్సినేషన్‌లో వారి పాత్ర కీలకం..
కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకురాగా, దేశ ప్రజలు మన టెక్నాలజీపై ఎంతో విశ్వాసం ఉంచారని ప్రధాని మోదీ అన్నారు. డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్, శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ ఆవిష్కర్తలు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారని, వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. 


వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డులు..
కేవలం 277 రోజుల్లోనే 100 కోట్ల మందికి వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వం 18 నెలల్లోనే 200 కోట్ల డోసుల వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేసింది. రికార్డు స్తాయిలో 2021  సెప్టెంబర్‌ 17న ఒక్కరోజులోనే 2.5 కోట్ల మందికి కరోనా టీకాలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.


Also Read: KCR on Cloud Bursting: భద్రాచలం వరదలపై కేసీఆర్ కొత్త అనుమానం, క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందని వ్యాఖ్యలు 


Also Read: KCR Performs Pooja: భద్రాచలం చేరుకున్న కేసీఆర్, గోదావరి నదికి శాంతి పూజలు చేసిన సీఎం