ICSE 10th Result 2022 : ఐసీఎస్ఈ(ICSE) 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు (జులై 17) సాయంత్రం 5 గంటలకు వెలువడనున్నాయి. ఫలితాలు ప్రకటన తర్వాత, విద్యార్థులు తమ స్కోర్‌కార్డ్‌లను ఐసీఎస్ఈ వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు. cisce.org లేదా results.cisce.org వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని బోర్డు ప్రకటించింది. కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) 10, 12వ తరగతి పరీక్షా ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
రెండు సెమిస్టర్ లకు సమాన వెయిటేజీ
ఫైనల్ స్కోర్‌లో రెండు సెమిస్టర్‌లకు సమాన వెయిటేజీ ఇస్తామని బోర్డు కార్యదర్శి గెర్రీ అరథూన్ చెప్పారు. సెమిస్టర్ 1 లేదా 2 పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులను గైర్హాజరీగా గుర్తిస్తామన్నారు. వారి ఫలితాలు ప్రకటించమని ఆయన తెలిపారు. "ICSE (10వ తరగతి), 2022 పరీక్ష ఫలితాలు జులై 17 ఆదివారం సాయంత్రం 5:00 గంటలకు ప్రకటిస్తాం. ఫలితాలు CISCE వెబ్‌సైట్‌లో CAREERS పోర్టల్‌లో , SMS ద్వారా అందుబాటులో ఉంచుతాం" అని తెలిపారు. CISCE, ICSE బోర్డు ఏప్రిల్ 25 నుంచి మే 23 వరకు సెమిస్టర్ 2 పరీక్షలను నిర్వహించింది.
స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా :
- www.cisce.orgలో CISCE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- హోమ్‌పేజీలో ICSE 10వ తరగతి ఫలితాలు 2022 లింక్‌పై క్లిక్ చేయండి
- గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలు నమోదు చేయండి
- సబ్మిట్ పై క్లిక్ చేయండి. మీ ICSE క్లాస్ 10 మార్క్‌షీట్ స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.
- రిజెల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తు అవసరం కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.
సీబీఎస్ఈ ఫలితాలపై కీలక అప్ డేట్
సీబీఎస్‌ఈ 10,12వ తరగతి పరీక్షా ఫలితాలపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. తాజాగా సీబీఎస్‌ఈ సమాచారం ప్రకారం త్వరలో ఫలితాల విడుదల తేదీని సీబీఎస్ఈ ప్రకటించనుంది. జులై చివరి వారంలో పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు జులై 20వ తేదీ తర్వాత, 12వ తరగతి ఫలితాలు జులై 31న విడుదలవుతాయని తెలుస్తోంది. ముందు CBSE Results 2022 జులై మొదటి వారంలో విడుదల చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై బోర్డ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. తాజాగా ఓ అధికారి తెలిపిన సమాచారం బట్టి జులై చివరి వారంలో కచ్చితంగా ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.