No Petrol In Five Years :   కాలంతో పాటు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఓ పదిహేనేళ్ల కిందట సెల్ ఫోన్ అనేది ఉంటే గొప్ప. ఇప్పుడు అది లేకపోతే జీవితం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. రేపు సెల్ ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా మరొకరటి రాదని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎస్టీడీ బూత్‌లు ఉన్నప్పుడు అలాంటి వాటికి ప్రత్యామ్నాయం వస్తుందని ఎవరూ ఇప్పుడు అవి లేవు. అలాగే ఇప్పుడు పెట్రోల్ అత్యవసరం.. వచ్చే రోజుల్లో అసలుపెట్రోల్ అవసరమే ఉండకపోవచ్చు. పెట్రోల్ బంకులన్నీ మూతపడొచ్చు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ధృవీకరిస్తున్నారు. 


సమోసా తింటే బిల్లు కట్టక్కర్లేదు పైగా రూ. 51 వేలిస్తారు - ట్రై చేస్తారా ?


వచ్చే ఐదేళ్లలో దేశంలో పెట్రోలు వినియోగంలో ఉండదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జోస్యంచెబుతున్నారు. మహారాష్ట్రలోని విదర్భ జిల్లాలో తయారవుతున్న బయో ఇథనాల్‌ను వాహనాల్లో వినియోగిస్తున్నారని గడ్కరీ చెబుతున్నారు.  గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి కిలో 70కే విక్రయించవచ్చన్నారు. రాబోయే ఐదేళ్లలో దేశంలో పెట్రోల్ అయిపోతుందని, దీని కారణంగా దేశంలో శిలాజ ఇంధనంపై నిషేధం విధించబడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రైతులు కేవలం ఆహార ప్రదాతలు మాత్రమే కాకుండా ఇంధన సరఫరాదారులుగా మారాల్సిన అవసరాన్ని కూడా గడ్కరీ ప్రస్తావించారు. గోధుమలు, వరి, మొక్కజొన్నలు వేయడం వల్ల ఏ రైతు భవిష్యత్తు మారదన్నారు. మహారాష్ట్రలోని అకోలాలో డాక్టర్ పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్.. కేంద్ర మంత్రి గడ్కరీకి డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన గడ్కరీ పై విధంగా కామెంట్స్ చేశారు.


"ఒరేయ్ రాములయ్య " క్యారెక్టర్ ఉంటే ఆ బీహార్ తండ్రిలాగే ఉండొచ్చు - ఏం చేశాడంటే ?


గడ్కరీ వ్యాఖ్యలు అసాధారణం ఏమీ కాదని నిపుణులు  చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వస్తోంది. ఎక్కడ చూసినా అవి కనిపిస్తున్నాయి. ఆటోమోబైల్ కంపెనీలన్నీ తమ భవిష్యత్ ప్రణాళికల్లో ఈవీలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముందు ముందు హైడ్రోజన్ కార్లు కూడా అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే పెట్రోల్, డిజిల్ అవసరం తీరిపోతుంది. ప్రపంచం వేగంగా మారుతోంది. ఈ క్రమంలో ఈ మార్పులుకూడా ఐదేళ్లలోనే వస్తాయని గడ్కరీ ఊహిస్తున్నారు. రావొచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు.  అదే జరిగితే ప్రజలకు చాలా సమస్యలు తీరిపోయినట్లే కదా !