Amnesty India ED :  అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ… ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా విభాగానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ రూ.  51.72 కోట్ల ఫైన్ విధించింది. అమ్నెస్టి ఇండియా మాజీ సీఈవో అకర్ పటేల్‌కు రూ. పది కోట్ల ఫైన్ విధించింది. విదేశాల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా విరాళాలను .. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి మరీ తీసుకొచ్చారని ఈడీ నిర్ధారించింది. గతంలోనే ఈ జరిమానాను విధించారు. ఇప్పుడు అడ్జుకేటింగ్ అధారిటీ ఆమోద ముద్ర వేసింది. 


"ఒరేయ్ రాములయ్య " క్యారెక్టర్ ఉంటే ఆ బీహార్ తండ్రిలాగే ఉండొచ్చు - ఏం చేశాడంటే ?


ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విరాళాలు తీసుకొస్తోందని అమ్నెస్టీ ఇండియాపైా ఆరోపణలు


ఈ సంస్థ దేశంలోకి అక్రమంగా నిధులు తీసుకొస్తోందని.. మత మార్పిళ్లకు.. దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని బ్యాంకు ఖాతాలన్నిటినీ గతంలోనే నిలిపివేశారు. ఆ కారణంగా  తమ సిబ్బందిని తొలగించింది.  అమ్నెస్టీ సంస్థ ప్రచారాలను, పరిశోధనా కార్యక్రమాలన్నిటినీ నిలిపేయాల్సి వచ్చింది. భారత్ లో కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమ్నెస్టీ కార్యకలాపాలు ఇండియాలో లేవు. 


ఆయుర్వేదంపై అధ్యయనం చేయండి, ఎన్‌ఈపీతో అద్భుత అవకాశాలు - ప్రధాని మోదీ


ప్రస్తుతం ఇండియాలో నిలిచిపోయిన అమ్నెస్టీ కార్యకలాపాలు


అయితే గతంలో నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ప్రస్తుతం జరిమానా విధించారు. మొత్తం 70 కి పైగా దేశాలలో పనిచేస్తున్న అమ్నెస్టీ  … 2016 లో రష్యాలో  కూడా  కార్యకలాపాలను నిలిపేసింది. తాజాగా… భారత్‌లో కూడా కార్యకలాపాలను నిలిపివేశారు.  2009లో కూడా ఒకసారి అమ్నెస్టీ, ఇండియాలో తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. 2019లో  చివర్లో అమ్నెస్టీ కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసి సోదాలు నిర్వహించింది. మరోసారి కేంద్ర హోం మంత్రిత్వశాఖ నమోదు చేసిన కేసులో ఈ దాడులు జరిగాయి.


'ఎవరు తప్పు చేశారో అప్పుడు తేలుతుంది'- సీఎం శిందేకు ఉద్ధవ్ ఠాక్రే సవాల్


గతంలో అమ్నెస్టీపై దేశద్రోహం కేసులు


విదేశాలనుంచీ నిధులను స్వీకరించడానికి అవసరమైన లైసెన్సును మళ్లీ మళ్లీ తిరస్కరిస్తున్నారని అందుకే అప్పట్లో తమ సంస్థ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అమ్నెస్టీ తెలిపింది. ఇటీవల కూడా ఇదే కారణంతో అమ్నెస్టీ సంస్థ భారత్ నుంచి వెళ్లిపోయింది.  2016లో ఒక కార్యక్రమంలో భారత వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై అమ్నెస్టీ ఇండియా మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు. మూడేళ్ల తరువాత కోర్టు ఆ అభియోగాలను తొలగించాలని ఆదేశించింది.