Bihar News : చేతిలో పొడుగాటి కత్తి. ఒంటిపై గళ్ల లుంగీ మాత్రమే ఉంది. సినిమా స్టైల్లో కోపంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఎదురొస్తే ఎవరైనా సరే ఒక్క వేటుతో తలతెగి పడాల్సిందేనన్నంత కసితో ఉన్నాడు. దాంతో ఎవరూ ఎదురెళ్లలేదు. ఆయన నేరుగా స్కూల్లోకి వెళ్లిపోయారు. దీంతో అందరూ కంగారు పడ్డారు. పిల్లలను ఏం చేస్తాడోనని. కానీ అక్కడేం జరగలేదు. కాసేపటికి పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్లిపోయారు. ఏమీ జరగలేదని అనుకోవడం కంటే.. అసలు ఇదంతా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే.. ఔరా ..అనుకోక తప్పదు.
ఆయుర్వేదంపై అధ్యయనం చేయండి, ఎన్‌ఈపీతో అద్భుత అవకాశాలు - ప్రధాని మోదీ
బీహార్‌లో అరారియా అనే ఊళ్లో స్కూళ్లు తెరిచారు. అక్కడ ప్రభుత్వం యూనిఫాం కొనుక్కోవడానికి పిల్లలకు డబ్బులిస్తుంది. అలా స్కూల్లో డబ్బులు ఇచ్చారు. అయితే ఓ విద్యార్థికి ఇవ్వలేదు. ఆ విషయం ఆ విద్యార్థి ఇంటికొచ్చి చెప్పాడు. అంతే.. ఆ తండ్రికి కోపం వచ్చితన పిల్లవాడికి డబ్బులివ్వరా అని తర్వాతి రోజు స్కూల్ జరుగుతున్న సమయంలో ఒంటిపై చొక్కా లేకుండా పొడుగాటి కత్తి తీసుకుని స్కూల్‌కు వెళ్లిపోయాడు. అక్కడ టీచర్లతో గొడవ పడ్డాడు.
'ఎవరు తప్పు చేశారో అప్పుడు తేలుతుంది'- సీఎం శిందేకు ఉద్ధవ్ ఠాక్రే సవాల్
పక్కనున్న వాళ్లు అతి కష్టం మీద అతని వద్ద ఉన్న కత్తిని లాగేసుకున్నారు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. అతనికి ఎందుకు యూనిఫాం డబ్బులు రాలేదో విడమర్చిచెప్పే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఈ లోపు పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్లారు. ఇప్పుడా కత్తితో తండ్రి చేసిన వీరంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గోధుమ పిండినీ ఎక్స్‌పోర్ట్ చేయటానికి వీల్లేదు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు