Pan American Highway will connect fourteen countries: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి, ఇది 14 దేశాల గుండా యూ-టర్న్‌లు లేకుండా సాగుతుంది. ఈ రహదారి పాన్-అమెరికన్ హైవేగా పిలుస్తారు. ఈ హైవే పొడవు  30,600 కిలోమీటర్లు అంటే   19,000 మైళ్లు . ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మోటారు వాహనాలకు అనువైన రహదారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.

ఈ రహదారి  అలాస్కాలోని  ప్రుడ్‌హో బే  నుంచి ప్రారంభమవుతుంది.  ఆర్కిటిక్ సముద్రం సమీపంలో  ఇది ఉంటుంది.  అర్జెంటీనాలోని ఉషుయాయా సమీపంలో ముగుస్తుంది.   దీనిని "ప్రపంచం   చివర" అని కూడా పిలుస్తారు. ఈ రహదారి ఒకే దిశలో సాగే అత్యంత పొడవైన రహదారి.  ఇందులో యూ-టర్న్‌లు  , మలుపులు లేకుండా వేల కిలోమీటర్ల పాటు సాగుతుంది.  పాన్-అమెరికన్ హైవే ఉత్తర, మధ్య,   దక్షిణ అమెరికాలోని  14 దేశాల  గుండా  వెళ్తుంది.  కెనడా,  యునైటెడ్ స్టేట్స్,  మెక్సికో ,  గ్వాటెమాల,  ఎల్ సాల్వడార్ ,  హోండురాస్,  నికరాగువా,  కోస్టా రికా,  పనామ,  కొలంబియా,  ఈక్వడార్,  పెరూ,  చిలీ,  అర్జెంటీనా దేశాల గుండా రహదారి ఉంటుంది.  ఈ దేశాలు ఒక్కొక్కటి ఈ రహదారి నిర్మాణం, నిర్వహణలో తమ వంతు బాధ్యతను చేపట్టాయి.  1920లలో, అమెరికా ఖండాల మధ్య పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, దీర్ఘ-దూర ప్రయాణాలను సులభతరం చేయడం, అమెరికన్ తయారీ కార్ల విక్రయాలను పెంచడం లక్ష్యంగా ఈ రహదారి ఆలోచన  చేశారు. 1937లో 14 దేశాలు పాన్-అమెరికన్ హైవే కన్వెన్షన్ పై సంతకం చేశాయి, దీని ద్వారా ఉత్తర ,  దక్షిణ అమెరికాలను ఒక నిరంతర రహదారి ద్వారా కలపాలని నిర్ణయించాయి.  1960ల నాటికి  ఈ రహదారి దాదాపు పూర్తయింది . అయితే   పనామ ,  కొలంబియా మధ్య సుమారు 60 మైళ్లు విస్తీర్ణంలో ఉన్న  దట్టమైన రెయిన్‌ ఫారెస్ట్  భాగంలో రహదారి నిర్మాణం జరగలేదు.   ఈ భాగాన్ని దాటడానికి  ప్రయాణికులు ఫెర్రీలు లేదా ఇతర వాహనాలను ఉపయోగించాలి.

 రోజుకు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ఈ రహదారి మొత్తాన్ని దాటడానికి సుమారు  60 రోజులు  పడుతుంది.  ఆర్కిటిక్ మంచు నుండి ఉష్ణమండల వర్షాల వరకు విభిన్న వాతావరణ పరిస్థితులు ఉటాయి.  14 దేశాలలో వివిధ భాషలు , సంస్కృతులు పలకరిస్తాయి.  రిమోట్ ప్రాంతాలలో ఇంధనం, ఆహారం, మరియు నీటి సరఫరా సమస్యలు కూడా ఉంటాయి. ఈ రహదారి పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుంది, వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది.  14 దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఇది వేల కిలోమీటర్ల పాటు పదునైన మలుపులు లేదా యూ-టర్న్‌లు లేకుండా సాగుతుంది.  పాన్-అమెరికన్ హైవే కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, ఇది ఉత్తర, మధ్య, మరియు దక్షిణ అమెరికాలను కలిపే సాంస్కృతిక, ఆర్థిక, మరియు సాహసోపేతమైన కారిడార్.