Pahalgam Terror Attack: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత, భారతదేశం పాకిస్తాన్‌తో ఉన్న ఏకైక భూమి వాణిజ్య మార్గమైన అట్టారీ బోర్డర్‌ను మూసివేసి వ్యాపారాన్ని నిలిపివేసింది. దీని వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. అయితే, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం, సరిహద్దు మూసివేయడం వల్ల అధికారికంగా వ్యాపారం మాత్రమే నిలిచిపోతుందని, డిమాండ్‌లో ఎలాంటి తగ్గుదల ఉండదని అంచనా. అంటే, పాకిస్తాన్ థర్డ్‌ పార్టీ ద్వారా అంటే ఏదైనా దేశం నుంచి ద్వారా పరోక్షంగా భారతీయ వస్తువులను దిగుమతి చేసుకోవడం కొనసాగించే ప్రయత్నం చేయవచ్చు, అయితే దాని ధర ఎక్కువగా ఉంటుంది.

పుల్వామా దాడి తరువాత కూడా భారతదేశం చర్య తీసుకుంది

GTRI ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తరువాత నుంచి భారతదేశం , పాకిస్తాన్ మధ్య వ్యాపార సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయని కూడా పేర్కొంది. ఆ సమయంలో కూడా భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది. వ్యాపారంలో అత్యంత అనుకూల దేశాల హోదా జాబితా నుంచి పాకిస్తాన్‌ను తప్పించింది. పాకిస్తాన్ దిగుమతులపై 200 శాతం వరకు అధిక దిగుమతి సుంకం విధించింది. GTRI ఏం చెబుతుంది అంటే సరిహద్దు మూసివేయడం వల్ల అధికారిక వ్యాపారం ఆగిపోతుంది, కానీ డిమాండ్‌లో ఎలాంటి తగ్గుదల ఉండదు అని పేర్కొంది.

పాకిస్తాన్‌లో ఈ భారతీయ ఉత్పత్తులకు డిమాండ్

పాకిస్తాన్ ఎక్కువ డబ్బులు చెల్లించి వేరే దేశాలు అంటే సంయుక్త అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ వంటి దేశాల నుంచి తమ దేశంలో డిమాండ్ ఉన్న భారతీయ వస్తువులను కొనుగోలు చేయడం కొనసాగిస్తుంది. పాకిస్తాన్ ఈ దేశాల ద్వారా ఔషధాలు, రసాయనాలు, పత్తి, టీ, కాఫీ, రంగులు, ఉల్లిపాయలు, టమాటాలు, ఇనుము, ఉక్కు, చక్కెర, ఉప్పు, ఆటోమొబైల్ విడిభాగాలు వంటి భారతీయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. 

ఎంతో దిగుమతి-ఎగుమతి జరిగింది

పుల్వామా దాడికి సంబంధించి భారతదేశం తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్ కూడా భారతదేశంతో వ్యాపారాన్ని నిలిపివేసింది. అప్పటి నుంచి అధికారిక వ్యాపారం చాలావరకు పరిమితం అయింది, కానీ మానవతా దృష్టితో భారతదేశం నుంచి కొన్ని అవసరమైన వస్తువుల ఎగుమతి జరుగుతూనే ఉంది, ఉదాహరణకు ఔషధాలు.

అధికారిక లెక్కల ప్రకారం, రెండు దేశాల మధ్య అధికారికంగా వ్యాపారం నిలిచిపోయినప్పటికీ, భారతదేశం గత సంవత్సరం  (ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025)లో పాకిస్తాన్‌కు 447.7 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.

అయితే, దీనికి విరుద్ధంగా, పాకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకున్నది చాలా తక్కువ. కేవలం 0.42 మిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే. 78,000 అమెరికన్ డాలర్ల విలువైన కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, ఉదాహరణకు అంజీర్ , 18,856 అమెరికన్ డాలర్ల విలువైన తులసి, రోజ్మేరీ వంటి మూలికలను దిగుమతి చేసుకుంది. 

దిగుమతి అంత ఈజీకాదు పాకిస్థాన్ రూపాయి రోజు రోజుకు పాతాళానికి పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి మారకపు విలువ దాదాపు మూడు వందలకు చేరుతోంది. ఇలాంటి సమయంలో భారత్ ఉత్పత్తులు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే కూడా భారీగా వెచ్చించాల్సి వస్తోంది. అందులో కొన్ని అత్యవసరమైన ఔషధాలు కూడా ఉండటం ఆ దేశానికి పెనుసవాల్ కానుంది.