Kalanki Bhairavudu Movie First Look: తెలుగు ప్రేక్షకులకు యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తెలుసు. కొన్నేళ్లుగా ఆయన సినిమాలు చేస్తున్నారు. నటుల్లోనూ ఆ పేరుతో ఎవరూ లేరు. ఇప్పుడు ఆ పేరుతో కొత్త హీరో వస్తున్నారు. అతని పేరు రాజశేఖర్ వర్మ. అతని సినిమా ఫస్ట్ లుక్ జీవితా రాజశేఖర్ దంపతులు విడుదల చేశారు. 

రాజశేఖర్ వర్మ హీరోగా 'కాళాంకి బైరవుడు''శ్రీరాముడింట శ్రీ కృష్ణుడంట', 'నివాసి' తర్వాత గాయత్రి ప్రొడక్షన్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 'కాళాంకి భైరవుడు' (Kalanki Bhairavudu). ఇదొక హారర్ థ్రిల్లర్ జానర్ సినిమా. ఇందులో రాజశేఖర్ వర్మ, పూజ కిరణ్ హీరో హీరోయిన్లు. హరి హరన్ వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కెఎన్ రావు, శ్రీనివాస రావు ఆర్ నిర్మాతలు.

'కాళాంకి భైరవుడు' ఫస్ట్ లుక్ రాజశేఖర్ - జీవిత దంపతుల చేతుల మీదుగా విడుదల అయ్యింది. హీరో ఇంటెన్స్ లుక్, ఆ పవర్ ఫుల్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. చిత్రీకరణ చివరి దశకు వచ్చిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. అతి త్వరలో థియేటర్లలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: 'సారంగపాణి జాతకం' సినిమా రివ్యూ: 'కోర్ట్' విజయం తర్వాత ప్రియదర్శికి మరో హిట్ వచ్చిందా? జాతకాల పిచ్చి నవ్వించిందా?

ఈ సినిమాలో ఆమని, రితికా చక్రవర్తి, నాగ మహేష్, 'బలగం' జయరాం, భవ్య, మహమ్మద్ బాషా, బిల్లి మురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కళా దర్శకుడు: బి జగన్, యాక్షన్: రామ్ సుంకర, కూర్పు: సాయి కిషోర్ కె, ఛాయాగ్రహణం: అశోక్ అన్నెబోయిన, సంగీతం: పెద్దపల్లి రోహిత్ (PR), నిర్మాతలు: కెఎన్ రావు - శ్రీనివాస రావు ఆర్, రచన - దర్శకత్వం: హరి హరన్ వి.

Also Readమూడో ప్లేసుకు పడిన కార్తీక దీపం 2... 'స్టార్ మా'లో టాప్ ప్లేసుకు ఆ మూడింటి మధ్య హోరాహోరీ పోటీ... టీఆర్పీల్లో ఈ వారం టాప్ 10 సీరియల్స్ లిస్ట్ ఇదిగో