Maharashtra Politics: 'ఎవరు తప్పు చేశారో అప్పుడు తేలుతుంది'- సీఎం శిందేకు ఉద్ధవ్ ఠాక్రే సవాల్

ABP Desam Updated at: 08 Jul 2022 05:25 PM (IST)
Edited By: Murali Krishna

Maharashtra Politics: మహారాష్ట్రలో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు.

( Image Source : Getty )

NEXT PREV

Maharashtra Politics: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేకు శివసేన అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తనను, తన కుటుంబాన్ని దూషించిన వారికి ఠాక్రే కుటుంబంపై గౌరవం ఉంటుందని తాను అనుకోవడం లేదని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.


శివసేన పార్టీ గుర్తును రెబల్స్ ఉపయోగించుకునే అవకాశమే లేదన్నారు. త‌న మ‌ద్ద‌తుదారులు ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.







ఈరోజే అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని అధికారంలో ఉన్న నాయ‌కుల‌కు స‌వాల్ విసురుతున్నాను. ఒక వేళ తాము త‌ప్పు చేస్తే ప్ర‌జ‌లు త‌మ‌ను ఇంటికి పంపిస్తారు. ఒక వేళ వారు త‌ప్పు చేస్తే వారిని ఇంటికి పంపించేస్తారు. శివ‌సేన నుంచి పార్టీ గుర్తును రెబెల్స్ తీసుకోలేరు. అయినా ప్ర‌జ‌లు సింబ‌ల్‌ను చూడ‌రు. నాయ‌కుల వ్య‌క్తిత్వాన్ని చూసి ఓటేస్తారు. శివ‌సేన‌లో ఉంటూ సొంత పార్టీ నాయ‌కుల‌కు ద్రోహం చేస్తార‌ని ఊహించ‌లేదు. ఇన్ని బెదిరింపులు వ‌చ్చినా త‌న‌తో ఉన్న 16 మంది ఎమ్మెల్యేల‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను.                                                      -   ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం


సోమవారం


శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ సోమ‌వారం విచార‌ణ‌కు రానుంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఏక్‌నాథ్ శిండేను ఆహ్వానించాల‌న్న గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారీ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా కూడా సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై కూడా సోమ‌వారం విచార‌ణ జ‌ర‌గ‌నుంది.


Also Read: Shinzo Abe Death: అందుకే షింజో అబేని కాల్చేశా- రీజన్ చెప్పిన హంతకుడు, గన్ కూడా సెల్ఫ్ మేడ్!


Also Read: Shinzo Abe Death Shot Dead: 'ఇది మాటలకందని విషాదం'- జాతీయ సంతాప దినం ప్రకటించిన మోదీ

Published at: 08 Jul 2022 05:20 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.