Shinzo Abe Death: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య ప్రపంచాన్నే షాక్‌కు గురి చేసింది. ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేని, సౌమ్యవాది అయిన షింజోను దారుణంగా కాల్చి చంపడంపై జపాన్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి కారణమేంటనే విషయంపై పలు ప్రశ్నలు వస్తున్నాయి. షింజోను కాల్చి చంపిన దుండగుడు ఎవరు? పోలీసులకు ఏం చెప్పాడు?






ఎవరంటే?


టెత్సుయా యమగామి(41) అనే వ్యక్తే షింజో అబేను కాల్చి చంపాడని పోలీసులు అరెస్ట్ చేశారు. యమగామి గతంలో జపాన్‌ సైన్యంలో మూడేళ్ల పాటు (2002-2005) పని చేశాడు. జపాన్‌ పశ్చిమ నగరం నారాలో ఓ ట్రైన్‌ స్టేషన్‌ ఎదుట శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో(అక్కడి కాలమానం ప్రకారం) పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తోన్న షింజో అబేపై అతను కాల్పులు జరిపాడు. 






ఆ సమయంలో వెనుక నుంచి షింజోపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు యమగామి. మొదటి బుల్లెట్‌కు వెనక్కి వంగిపోయిన షింజో, రెండో బుల్లెట్‌ తగలగానే కుప్పకూలిపోయారు. ఆ వెంటనే దుండగుడు యమగామిని పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.


ఇదే రీజన్


ఇక పోలీసుల ఎదుట యమగామి నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే షింజోను ఎందుకు కాల్చి చంపావనే ప్రశ్నకు యమగామి చెప్పిన సమాధానం పోలీసులకు కూడా అర్థం కాలేదని సమాచారం.


"షింజో అబేపై నాకు ఎలాంటి పగ లేదు, కానీ అసంతృప్తితో రగిలిపోతున్నాను,అందుకే ఆయన్ని చంపాలని నిర్ణయించుకున్నాను." అని నిందితుడు.. పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.


సెల్ఫ్ మేడ్ గన్


అయితే అతని అసంతృప్తికి కారణాలు ఏంటి? నిందితుడి బ్యాక్‌గ్రౌండ్‌ తదితర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. కాల్పులకు పాల్పడిన తుపాకీని అతనే స్వయంగా తయారు చేసుకున్నట్లు సమాచారం. 


Also Read: Shinzo Abe Death Shot Dead: 'ఇది మాటలకందని విషాదం'- జాతీయ సంతాప దినం ప్రకటించిన మోదీ


Also Read: Maldives in Malad: ముంబయిలో మాల్దీవ్స్- ఏం ఎంజాయ్ చేస్తున్నావ్ బాస్!