Shinzo Abe Death Shot Dead: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటల కందని విషాదంగా మోదీ పేర్కొన్నారు. ఓ గొప్ప నేతను ప్రపంచం కోల్పోయిందంటూ మోదీ వరుస ట్వీట్లు చేశారు.
నా ప్రియమైన స్నేహితుడు షింజో అబేను కోల్పోవడం చాలా షాక్‌గా ఉంది, ఇది మాటలకందని విషాదం. ఆయన ప్రపంచంలోనే గొప్ప రాజనీతిజ్ఞుడు, అద్భుత నాయకుడు, పాలకుడు. జపాన్ సహా ప్రపంచాన్ని గొప్పగా మార్చడానికి ఆయన తన జీవితాన్నే అంకితం చేశారు. - ప్రధాని నరేంద్ర మోదీ
మా స్నేహం
అబేతో నా పరిచయం, ప్రయాణం చాలా ఏళ్ల క్రితమే జరిగింది. నేను గుజరాత్ సీఎంగా ఉన్న సమయం నుంచే ఆయన గురించి తెలుసు. తర్వాత నేను ప్రధాని అయిన తర్వాత మా స్నేహం మరింత బలంగా మారింది. ఆర్థిక, ప్రపంచ అంశాలపై ఆయనకు చాలా పట్టు ఉంది. ఆయన ప్రభావం నాపై కూడా ఎక్కువగానే ఉంది. - ప్రధాని నరేంద్ర మోదీ
ఇటీవలే
ఇటీవల నా జపాన్ పర్యటనలో అబేను మళ్లీ కలిసే అవకాశం దక్కింది. ఆ సమయంలో ప్రపంచ సమస్యలపై మేం చర్చించాం. ఎప్పటిలానే ఎంతో ఆప్యాయంగా ఆయన మాట్లాడారు. అయితే ఇదే మా చివరి సమావేశం అని నాకు తెలియదు. ఆయన కుటుంబం, జపాన్ ప్రజలకు నా ప్రగాఢ సంతాపం. ఆయన గౌరవార్థం జులై 9, 2022న జాతీయ సంతాప దినంగా ప్రకటిస్తున్నాను. - ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: Money Laundering Case: సీఎం ఇంటిపై ఈడీ దాడులు- 18 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
Also Read: Mohammad Zubair Bail: జర్నలిస్ట్ జుబైర్‌కు ఊరట- ఆ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం