Mohammad Zubair Bail: ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు. ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్‌లో ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి ఈ బెయిల్ ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.
5 రోజులే
ఈ కేసుకు సంబంధించి జుబైర్‌కు ఐదు రోజులు మాత్రమే సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు నమోదైన ఘటనపై మరోసారి ఎలాంటి ట్వీట్లు చేయరాదని ఆదేశించింది. అలానే సీతాపుర్ మెజిస్ట్రేట్ కోర్టు పరిధిని దాటి ఎక్కడికి వెళ్లరాదని హెచ్చరించింది. అలానే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించకూడదని పేర్కొంది.
అలానే అల్‌హాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జుబైర్ వేసిన పిటిషన్‌పై యూపీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది.
ఇదీ కేసు
2018లో జుబైర్ చేసిన ట్వీట్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందన్న కేసులో ఆయనను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ట్వీట్స్ చేశారంటూ జూన్ 27న జుబైర్‌ను అరెస్ట్ చేశారు. సెక్షన్ 153, సెక్షన్ 295ఏ కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
ఇటీవల నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను కూడా ముందుగా ట్వీట్ చేసింది జుబైర్‌నే. దీంతో ఆయన రెచ్చగొట్టే ట్వీట్స్ చేసినట్లు దిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ప్రజల్లో ద్వేషభావాన్ని పెంచేలా జుబైర్ ట్వీట్లు ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Also Read: Uttarakhand Car Accident: నదిలో కొట్టుకుపోయిన కారు- 9 మంది మృతి!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 18,815 కరోనా కేసులు- 38 మంది మృతి