Corona Cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగా ఉన్నాయి. కొత్తగా 18,815 కరోనా కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. తాజాగా 15,899 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.52 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.27 శాతం ఉన్నాయి.
- డైలీ పాజిటివిటీ రేటు: 4.96 శాతం
- మొత్తం మరణాలు: 5,25,343
- యాక్టివ్ కేసులు: 1,22,335
- మొత్తం రికవరీలు: 4,29,37,876
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 17,62,441 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,51,77,962కు చేరింది. మరో 3,79,470 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరింది. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: Viral Video : ఛీ ఛీ, ఉమ్మి వేసి బట్టలు ఇస్త్రీ చేస్తున్న వ్యక్తి, వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం!