Viral Video : రోటీ, కూరగాయలపై ఉమ్మి వేసి అమ్మే వీడియోలు వైరల్ అవ్వడం చూశాం. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో అధికారులు చర్యలు తీసుకున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నీరు తాగి వాటిని ఉమ్మి వేస్తూ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు. వీడియో వైరల్ కావడంపై అతను చేస్తున్న పనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిదో, ఎక్కడిదో ఎలాంటి సమాచారం లభించడంలేదు. అయినా ఎంతో నమ్మకంగా ఇస్త్రీకి బట్టలు ఇస్తే సదరు వ్యక్తి నీళ్లు తాగి వాటిని ఉమ్ముతూ ఇస్త్రీ చేయడంపై వీడియో చూసిన వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు
ఈ మధ్య పానీపూరీ వాటర్ లో మూత్రం పోసి అమ్మేస్తున్న వ్యక్తి వీడియోను చూసి ఛీ యాక్ అని అనుకున్నాం. తాజాగా అటువంటి వీడియోనే మరొక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి ఉమ్మి వేస్తూ బట్టలు ఇస్త్రీ చేస్తున్నారు. ఇటీవల మరొక వీడియో వైరల్ అయింది. అందులో టోస్టులను తయారు చేసే వర్కర్లు వాటిని తొక్కుతూ ఉమ్మి వేస్తూ పని చేశారు. ఈ వీడియో చూసినవారు ఇంకోసారి జన్మలో ఛాయ్‌తో కలిపి టోస్టులు, రస్కులను తినరు. ఎందుకంటే టోస్టులను తయారుచేసే వర్కర్లు వాటిని తయారు చేసిన తర్వాత వాటిని కాళ్ల కింద వేసి తొక్కకున్నారు. వాటి మీద ఉమ్మి వేయడం, వాటిని నాకడం లాంటివి చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు ఈ వీడియో స్పష్టంగా కనిపిస్తుంది.
మరో వీడియో వైరల్
కొందరు వర్కర్లు చేస్తున్న ఈ పిచ్చి చేష్టలు వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఆ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా కొందరు వర్కర్లు కావాలని అప్పటికే తయారు చేసిన టోస్టులపై మురికిగా ఉన్న కాళ్లు పెట్టడం, వాటి మీద ఉమ్మేయడం చేశారు. వాటినే నాకి ప్యాకింగ్ చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. కావాలనే ఈ వీడియో తీస్తున్నారని తెలిసి కూడా వర్కర్లు పిచ్చి చేష్టలు చేస్తూ అటువంటి పనులు చేయడం నెటిజన్లు మండిపడుతున్నారు. వాళ్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.