Uttarakhand Car Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నైనిటాల్ జిల్లాలో ఓ కారు అదుపుతప్పి ధేలా నదిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఓ బాలికను మాత్రం కాపాడగలిగారు.
ఇదీ జరిగింది.
రామ్ నగర్ ప్రాంతం వద్ద ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి ధేలా నదిలో పడిపోయింది. నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఓ బాలిక మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఆ బాలికను రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.
భారీ వర్షాలకు
ఉత్తరాఖండ్ అంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ధేలా నది ఉప్పొంగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ నీటి ప్రవాహం కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. అతివేగం కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 18,815 కరోనా కేసులు- 38 మంది మృతి
Also Read: Viral Video : ఛీ ఛీ, ఉమ్మి వేసి బట్టలు ఇస్త్రీ చేస్తున్న వ్యక్తి, వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం!