Maldives in Malad: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబయిలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు అన్నీ చెరువులుగా మారాయి. సముద్రం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ముంబయి సహా ముఖ్య నగరాల్లో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఓవైపు ఇంత జరుగుతుంటే ఓ మనిషి మాత్రం హాయిగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.



ముంబయిలో


ఓ వ్యక్తి వర్షపు నీటిలో పడుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదో మాల్దీవ్స్‌లోని స్విమ్మింగ్ ఫూల్‌లో ఉన్నట్లు నీటిలో పడుకుని వర్షాన్ని ఆస్వాదిస్తున్నాడు. పోని వర్షంలో పడుకున్నాడు అంటే.. ఆయన ఇంటి మేడపైన అనుకున్నారా? కాదు.. అది కూడా రహదారులపై నిండి ఉ‍న్న వాన నీటిలో పడుకున్నాడు.


మరోవైపు నుంచి ఆ వ్యక్తి సమీపం నుంచి వాహనాలు నీళ్లను చిమ్ముకుంటూ వెళ్లిపోతున్నాయి. అతను మాత్రం తనకేం పట్టనట్లు తన పని తనదే అ‍న్నట్లు అక్కడ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వరైల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కూడా  ముంబయిలో మాల్దీవ్స్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.