Balaghat Crime News:మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన జరిగింది. ముగ్గురు గిరిజన బాలికలపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడుగురు వ్యక్తులు ఈ నేరానికి పాల్పడినట్లు సమాచారం.
బాధిత బాలికల పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనకు కారణమైన ఏడుగురు నిందితులను బాలాఘాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.