Bahubali Samosa :  సమోసాలు అంటే మనకు తెలిసింది అనియన్ సమోసా. ఇలాంటివి నాలుగైదు ఈజీగా లాగించేయవచ్చు. ఇది కాదు అనుకుంటే ఆలూ సమోసా ఉంటుంది. అవి రెండు తింటే ఓ పూటభోజనం తిన్నట్లే. అంత కంటే పెద్ద సమోసాలు ఎక్కడా చూసి ఉండం. కానీ ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వ్యాపారి ఎనిమిది కేజీల బరువుంటే సమోసా తయారు చేశాడు. అలాంటి సమోసా ఎవరూ కొనరు కదా.. అతను కాడా అమ్మడానికి కొనలేదు. దానికి బాహుబలి సమోసా అని పేరు పెట్టి ప్రదర్శనకు పెట్టాడు. పోటీ కూడా పెట్టాడు. ఈ సమోసాను అరగంటలో తింటే... దానికి బిల్లు కట్టక్కర్లేదని... పైగా తానే రూ. 51 వేలు ఇస్తానని ఆఫర్ ప్రకటించాడు.


ఆయుర్వేదంపై అధ్యయనం చేయండి, ఎన్‌ఈపీతో అద్భుత అవకాశాలు - ప్రధాని మోదీ




తన దుకాణానికి ఏదైనా ప్రత్యేకత ఉండాలని శుభం అనే వ్యాపారి ఈ భారీ సమోసా తయారు చేశాడు. దానికి బాహుబలి సమోసా అని పేరు పెట్టాడు. ఈ సమోసాలో ఆలూ, బఠానీలతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు. సమోసా తయారీకి రూ. 1100 ఖర్చు అయిందని వ్యాపారి చెబుతున్నారు. అయితే ట్రై చేసి మొత్తం తినకపోతే సమోసాకు బిల్లు కట్టాలి. చాలా మంది ట్రై చేశారని కానీ ఎవరూ తినలేకపోయారని శుభం చెబుతున్నారు. 




శుభం ఎవరూ అంత పెద్ద సమోసాను తినే బాహుబలి రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఎవరైనా వచ్చి చాలెంజ్‌ను స్వీకరించి సమోసా తింటే రూ. యాభై ఒక్క వేలు ఇద్దామని అనుకుంటున్నాడు. తర్వాత పది కేజీల సమోసా చేద్దామనుకుంటున్నాడు. కానీ ఇంత వరకూ ఎవరూ తినలేకపోయారు. అందుకే.. మరికొంత ప్రచారం వస్తే ఎక్కువ మంది వస్తారని లోకల్ మీడియాకు సమాచారం ఇచ్చాడు.



గోధుమ పిండినీ ఎక్స్‌పోర్ట్ చేయటానికి వీల్లేదు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు



ఈ న్యూస్ వైరల్ అయింది. దీంతో శుభం దుకాణానికి వచ్చే వారు కూడా పెరిగిపోయారు. ఇప్పుడు అతనికి రెండు విధాలుగా లాభం కలుగుతోంది. ఒకటి దుకాణానికి గిరాకీ.. మరో విధంగా ఆ సమోసా అమ్మకం. మొత్తానికి శుభం లాంటి వ్యాపారులు వినూత్న ఐడియాలు అమలు చేస్తేనే ఇలాంటి కాంపిటిషన్లు కూడా వెలుగులోకి వస్తాయి.   ఈ బాహుబలి సమోసాని ట్రై చేయాలంటే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వెళ్లాల్సిందే.